OTT లో దూసుకెళ్తున్న ప్రైమ్ వీడియో ఇసకపట్నం; సక్సెస్ ను సెలెబ్రేట్ చేస్తూ బహుమతులు పంపిన ప్రైమ్ వీడియో
డైరెక్టర్ గ్యారీ BH తెరకెక్కించిన ప్రైమ్ వీడియో కొత్త సిరీస్ ఇసకపట్నం లో ఐశ్వర్య రాజేష్, సముద్రఖని, సునీల్, నరేష్ అగస్త్య నటించారు. కల్పిత మత్స్యకార పట్టణంగా సెట్ చేసిన ఈ కథలో క్రైమ్, ఫ్యామిలీ డ్రామా, తో కలిసి ఒక ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నేపథ్యం, మాండలికం, సంగీతం అన్ని కలిసి ఇసకపట్నంని థ్రిల్లింగ్ డ్రామా గా మలిచాయి.
ఈ సిరీస్ ఇసకపట్నం ఓడరేవులో అధికారం, విశ్వాసం, మనుగడ చుట్టూ తిరుగుతుంది. ఇంటెన్స్ నటన, ట్విస్ట్ లతో నిండిన ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. స్థానికత, మార్కెట్లు, సముద్రతీర జీవితాన్ని సినిమాటిక్ గా చూపిన తీరుకు విమర్శకుల ప్రశంసలు వస్తున్నాయి. తమడా మీడియా అత్యుత్తమ నిర్మాణ విలువలు తో సినిమాటిక్ విజువల్ క్వాలిటీ తో ప్రెజెంట్ చేయడం బాగుంది.
లాంచ్ సందర్భంగా ప్రైమ్ వీడియో ప్రత్యేక ఇసకపట్నం గిఫ్ట్స్ ఇచ్చింది. సిరీస్ పవర్ పాలిటిక్స్ థీమ్, రస్టిక్ వైబ్ ని ప్రతిబింబించే కస్టమ్ డిజైన్ చైర్ ప్రధాన ఆకర్షణ. మీడియాకు ధన్యవాదాలతో డ్రై ఫ్రూట్స్ కూడా పంపి అనుభూతిని మరింత ప్రత్యేకంగా మార్చారు.
ఇసకపట్నం తన ప్రత్యేకమైన నేపథ్యం, బలమైన పాత్రలు, ఎమోషనల్ డెప్త్ తో ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రాంతీయ సంస్కృతిని చూపిస్తూనే ఆకట్టుకునే డ్రామాను అందిస్తోంది. ప్రైమ్ వీడియో ప్రమోషన్ తో ఈ సిరీస్ చిన్న తీరప్రాంత పట్టణ కథలను జాతీయ స్థాయిలో వెలుగులోకి తెస్తోంది.



