‘భరతవర్ష’ నుంచి పవర్ ఫుల్ ఎపిక్ జర్నీ ఫస్ట్ సింగిల్ ‘వీర జయధీర’ రిలీజ్

0
115
Bharata Varsha First Single Veera Jayadheera ReleasedBharata Varsha First Single Veera Jayadheera Released
Bharata Varsha First Single Veera Jayadheera Released
టి. గోపీచంద్, సంకల్ప్, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ‘భరతవర్ష’ నుంచి పవర్ ఫుల్ ఎపిక్ జర్నీ ఫస్ట్ సింగిల్ ‘వీర జయధీర’ రిలీజ్

టి. గోపీచంద్ ప్రతిష్టాత్మక చారిత్రక యాక్షన్ చిత్రం ‘భరతవర్ష’ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో అంచనాలను పెంచుతూనే ఉంది. సంకల్ప్ దర్శకత్వంలో, శ్రీనివాస చిట్టూరి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి పవన్ కుమార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. క్రీ.శ. 642 నేపథ్యంలో సాగే ఈ చిత్రం, విజువల్ గా  అద్భుతమైన గ్లింప్స్, టైటిల్ టీజర్‌తో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు, చిత్ర నిర్మాతలు ఫస్ట్ సింగిల్ ‘వీర జయధీర’ విడుదల చేశారు.

‘వీర జయధీర’ కథానాయకుడి ప్రయాణాన్ని, అతని పరివర్తనను ఆవిష్కరించే పవర్ ఫుల్ పాట గా నిలిచింది. ఒక సాధారణ వ్యక్తి నుంచి పరాక్రమవంతమైన యోధుడిగా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న కష్టాలు, పట్టుదల, లక్ష్యసాధన కోసం చేసిన పోరాటాన్ని ఈ పాట భావోద్వేగంగా చూపిస్తుంది. కథలోని ప్రధాన పాత్ర అంతర్మథనాన్ని, అతని జీవిత గమ్యాన్ని ఈ పాట అద్భుతంగా ప్రజెంట్ చేసింది

సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ ఈ పాటకు అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్‌తో కూడిన సంగీతాన్ని అందించారు. చంద్రబోస్ రచించిన సాహిత్యం ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల వంటి విలువలను గొప్పగా చూపించాయి. దీపక్ బ్లూ, లక్ష్మీ మేఘన తమ వొకల్స్ తో పాటకు మరింత ప్రాణం పోశారు.

https://www.youtube.com/watch?v=_ngYnrBiZFk&list=RD_ngYnrBiZFk&start_radio=1

ఈ పాటలోని విజువల్స్ కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మంచుతో కప్పబడిన పర్వతాలు, క్లిష్టమైన భూభాగాల మధ్య ఒంటరి యోధుడిగా గోపీచంద్ చేసే ప్రయాణం అద్భుతంగా కనిపిస్తుంది. ఆ విశాలమైన లొకేషన్స్ కథానాయకుడి ఒంటరితనం, సంకల్పం, ధైర్యాన్ని మరింత బలంగా చూపిస్తున్నాయి.

ఈ పాత్ర కోసం గోపీచంద్ పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపిస్తున్నారు. ఓ యోధుడి ఆత్మను తన నటనలో ఆవిష్కరిస్తూ ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్‌గా రీతూ వర్మ నటిస్తుండగా, ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉండనుంది.

‘వీర జయధీర’ పాటతో ‘భరత వర్ష’ యుద్ధాలు, విజయాలతో పాటు హీరో వ్యక్తిగత ప్రయాణం, ఆత్మవికాసం వైపు ప్రేక్షకుల దృష్టిని మళ్లించింది. ఈ పాటను బట్టి చూస్తే, ఈ చిత్రం కేవలం భారీ యాక్షన్, విజువల్ గ్రాండియర్ మాత్రమే కాకుండా ధైర్యం, విధి, ఆత్మజ్ఞానంతో కూడిన భావోద్వేగ ప్రయాణాన్ని కూడా అందించబోతోందని స్పష్టమవుతోంది.

ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీతో 7వ శతాబ్దపు భారతదేశాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుండగా, చిన్నా ప్రొడక్షన్ డిజైన్ ఆ కాలం వైభవాన్ని అత్యంత సహజంగా రీక్రియేట్ చేస్తోంది. అనుదీప్ దేవ్ సంగీతం కథని మరింతగా ఎలివేట్ చేస్తోంది.

చిత్రీకరణ చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ ‘భరత వర్ష’పై ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

తారాగణం: టి. గోపీచంద్, రితు వర్మ

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం సంకల్ప్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సమర్పణ: పవన్ కుమార్
సంగీతం: అనుదీప్ దేవ్
సినిమాటోగ్రాఫర్: సౌందర్ రాజన్
ఎడిటర్: చోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా
ఫైట్ మాస్టర్స్: వెంకట్, పృథ్వీ, రియల్ సతీష్
డ్యాన్స్ మాస్టర్స్: శంకర్, విజయ్ పోలంకి
పీఆర్ఓ: వంశీ-శేఖర్
మార్కెటింగ్: విష్ణు తేజ్ పుట్ట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here