యశ్ రాజ్ ఫిల్మ్, ఆలియా భట్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్.. జూలై 3న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్
ఆలియా భట్ ప్రధాన పాత్రలో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్న భారీ యాక్షన్ మూవీ ‘ఆల్ఫా’. బుధవారం (జూన్ 10) మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆలియా భట్ ఓ హంతుకురాలి పాత్రలో నటించింది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న ఆల్ఫా చిత్రాన్ని ..చిన్న వయస్సు నుంచే పెంచి, హత్యలు చేయడానికి తయారు చేసిన ఓ హంతకురాలుకి సంబంధించిన మూల కథతో రూపొందించారు.
టీజర్‌ను గమనిస్తే.. బాబీ డియోల్ తండ్రి పాత్రలో కనిపించారు. తన కుమార్తెను బాబీ చిన్నప్పటి నుంచే హత్యలు చేసే ఓ హంతురాలిగా పెంచి పెద్ద చేస్తాడని అర్థమవుతుంది. అలాగే ఆమె చేసిన భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా మనం ఇందులో గమనించవచ్చు. త్వరలోనే ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటించిన శర్వారి పాత్రను మేకర్స్ పరిచయం చేయబోతున్నారు.
ఆల్ఫా స్వభావాన్ని అలవరుచుకున్న ఇద్దరమ్మాయిల కథతో తెరకెక్కిన పాప్‌కార్న్ సినిమా. ఇద్దరు హీరోయిన్స్ ప్రధాన పాత్రధారులుగా ఇప్పటి వరకు యాక్షన్ సన్నివేశాలతో రూపొందింది.
థ్రిల్లింగ్, ఎమోషనల్, ఫన్నీ ఎలిమెంట్స్‌తో ఎవరూ ఊహించని మలుపులతో రైడింగ్‌లా ఆల్ఫా సినిమాను రూపొందించారు.
‘ఆల్ఫా’ మూవీని గ్లోబల్ హిట్ సిరీస్ రైల్వే మెన్ ఫేమ్ శివ్ రవాలి తెరకెక్కిస్తున్నారు. బాబీ డియోల్, అనీల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 3న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది.



