‘సోల్ ఆఫ్ లెనిన్’కి థియేటర్లలో అద్భుతమైన స్పందన.. జూన్ 26న ‘మనోడు వస్తున్నాడు’
మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లెనిన్’. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది.
ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెంచేశాయి. ఇటీవల మేకర్స్ ‘సోల్ ఆఫ్ లెనిన్’ అంటూ ఆడియెన్స్‌ని సర్ ప్రైజ్ చేశారు. ‘పెద్ది’ సినిమా ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తోంది. ‘పెద్ది’ ప్రదర్శనలకు ఈ ‘సోల్ ఆఫ్ లెనిన్’ను జోడించారు. ఈ ఉద్వేగభరితమైన, పవర్ ఫుల్ పాటకు బ్లాక్‌బస్టర్ స్పందన లభించింది. సినీ లవర్స్ ఈ పాట, అందులోని క్లిప్స్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తూ అద్భుతంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు.
ఈ పాటలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే మధ్య ఉండే ప్రేమ, వారి బాండింగ్‌ను చక్కగా చూపించారు. ‘ప్రేమ కంటే గొప్ప యుద్ధం లేదు’ అనే క్యాప్షన్‌తో ఈ పాట సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రేమ కోసం అఖిల్ చేసే పోరాటం, భాగ్యశ్రీ ఆకట్టుకునే నటన ఈ పాటకు మరింత అదనపు ఆకర్షణను జోడించాయి. థమన్ స్వరపరిచిన ఈ పాట ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం, వాగ్దేవి గాత్రం ఈ పాటను మరింత అందంగా మలిచాయి. ఈ పాటలోని ప్రతి ఫ్రేమ్, ప్రతి విజువల్ భావోద్వేగాలతో కూడిన ఒక కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుందని హామీ ఇస్తున్నాయి. అఖిల్ మాస్ అప్పీల్, యాక్టింగ్, ఎమోషన్స్ అన్నీ కూడా ఈ పాటలో కనిపిస్తున్నాయి. పాటలు, గ్లింప్స్, పోస్టర్లతోనే సినిమాపై అంచనాలను గణనీయంగా పెరిగాయి.
ఈ చిత్రానికి సంగీతాన్ని థమన్ ఎస్ అందించారు. పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమా స్థాయిని మరింత పెంచుతాయని భావిస్తున్నారు. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
ఈ చిత్రం జూన్ 26, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
తారాగణం: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, శివాజీ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్స్ : మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ
సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్
రచయిత, దర్శకుడు: మురళి కిషోర్ అబ్బూరు
సంగీతం: థమన్ ఎస్
ఎడిటర్: నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ: లియోన్ బ్రిట్టో
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా



