నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ ‘దూత 2’ కింగ్ నాగార్జున క్లాప్‌ తో ఘనంగా ప్రారంభం

0
3
Dhootha 2 Launched With Puja Muhurtham Ceremony
Dhootha 2 Launched With Puja Muhurtham Ceremony

నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్, శరత్ మారార్, అన్నపూర్ణ స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ ప్రైమ్ ‘దూత 2’ కింగ్ నాగార్జున క్లాప్‌ తో ఘనంగా ప్రారంభం

యువ సామ్రాట్ నాగచైతన్య అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన సూపర్‌నేచురల్ థ్రిల్లర్ ‘దూత’తో ఓటీటీలో సంచలన అరంగేట్రం చేశారు.  ‘దూత’ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ పలు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రేక్షకులను ఆకట్టుకుని గ్లోబల్ ఫెనామెనాన్‌గా నిలిచింది.

తొలి సీజన్ నాగచైతన్యకు డిజిటల్ ప్రేక్షకుల్లో మరింత గుర్తింపును తీసుకురావడమే కాకుండా, నటుడిగా ఆయనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీతో తన అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, నాగచైతన్య సీక్వెల్ కోసం నిర్మాతగానూ మారుతున్నారు. శరత్ మరార్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై నిర్మిస్తున్నార.

మొదటి సీజన్‌కు ప్రధాన బలంగా నిలిచిన తన అద్భుత కథన శైలితో విక్రమ్ కె కుమార్ రెండో సీజన్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను నేడు సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన కింగ్ నాగార్జున అక్కినేని క్లాప్ కొట్టి, స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందజేశారు.

తండేల్’ బ్లాక్‌బస్టర్ విజయానంతరం ‘వృషకర్మ’ చేస్తున్న నాగచైతన్య తన తదుపరి ప్రధాన ప్రాజెక్ట్‌గా ‘దూత 2’ను ఎంచుకోవడం విశేషం. అంతేకాక నిర్మాతగా కూడా భాగస్వామి కావడం, ఈ కథపై ఆయనకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.

ఈసారి విక్రమ్ కె కుమార్ మరింత ఉత్కంఠభరితమైన, మిస్టరీతో నిండిన కథను సిద్ధం చేశారు. మొదటి సీజన్‌ను మించిన స్థాయిలో సస్పెన్స్, సైకాలజికల్ థ్రిల్స్, సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనున్నారు.

ఈ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  

ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తున్నారు. ‘సుజల్: ది వోర్టెక్స్’ తొలి సీజన్‌కు పనిచేసిన వి. ముకేశ్వరన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఈషాన్ ఛాబ్రా సంగీతం సమకూరుస్తున్నారు. ప్రవాల్య డి ప్రొడక్షన్ డిజైనర్‌గా, అనూష పుంజాల కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.

మొదటి భాగాన్ని మించిన స్థాయిలో మరింత భారీగా, ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘దూత 2’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

నటీనటులు: నాగ చైతన్య, పార్వతీ తిరువోతు, ప్రియా భవాని శంకర్  

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్
నిర్మాతలు: నాగ చైతన్య, శరత్ మరార్
బ్యానర్లు: అన్నపూర్ణ స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
DOP: ముఖేశ్వరణ్
సంగీతం:  ఈషాన్ ఛాబ్రా
ప్రొడక్షన్ డిజైనర్: ప్రవళ్య డి
కాస్ట్యూమ్ డిజైనర్: అనుష పుంజాల
PRO: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here