దేవీప్రసాద్ కుంచెలో సూపర్ స్టార్ కృష్ణ

0
6

దేవీప్రసాద్ కుంచెలో సూపర్ స్టార్ కృష్ణ

నాకు ఊహ తెలిసి నాకు గుర్తుండి వెండితెరమీద నేను చూసిన మొదటి సినిమా కృష్ణ గారిదే.

లైవ్‌లో నేను చూసిన మొదటి హీరో కృష్ణ గారే.

నేను తొలిసారి అభిమానించిన హీరో కృష్ణ గారే.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా,అసోసియేట్ డైరెక్టర్‌గా కొన్ని సినిమాలకు ఆయన ప్రక్కన నిలబడి ఆయనకు డైలాగులు చెప్పటం, పసిపిల్లాడిలా నవ్వుతూ ఆయన చెప్పే కబుర్లు దగ్గరగావుండి వినగలగటం నాకు దక్కిన మధురానుభూతులు.

నా దర్శకత్వంలో “లీలామహల్ సెంటర్” అనే సినిమాలో ఆయన మీద ఓ ప్రత్యేకమైన పాటను చిత్రీకరించటానికి పాటను రికార్డ్ చేశాము కూడా. కానీ చిత్రీకరించలేదు. అది జరిగివుంటే ఆయనని డైరెక్ట్ చేసే భాగ్యం కూడా దక్కివుండేది నాకు.

చిన్న వయసునుండి నేను గీసిన బొమ్మలలో ఎక్కువబొమ్మలు కృష్ణ గారివే.

ఆయనని రకరకాల గెటప్పులలో ఊహించుకుని మరీ గీసి స్నేహితులకు చూపించేవాడిని.

మనిషితనము, మంచితనము, గొప్పతనము కలగలిసిన వ్యక్తిత్వం కృష్ణగారిది.

అందుకే ఆయన పుట్టుక ఎంతోమందికి విలువైనదయ్యింది.

మా “సూపర్‌స్టార్” కి జయంతి(మే 31) నివాళులర్పిస్తున్నా.

( కుంచెని నా “అభిమానం” లో ముంచి నేను చిత్రించిన కొన్ని చిత్రాలివి)

______ దేవీప్రసాద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here