“అగ్లీ స్టోరీ” చిత్రానికి వచ్చిన అనూహ్య స్పందనకు చిత్ర టీం థాంక్యూ మీట్

0
9
“Ugly Story” Team Thank You Meet
“Ugly Story” Team Thank You Meet

“అగ్లీ స్టోరీ” చిత్రానికి వచ్చిన అనూహ్య స్పందనకు చిత్ర టీం థాంక్యూ మీట్

నందు, అవికా గోర్ జంటగా నటిస్తూ నిన్న ప్రేక్షకుల ముందుకువచ్చిన ‘అగ్లీ స్టోరీ’ చిత్రానికి వచ్చిన అనూష స్పందనకు ఈ చిత్ర టీం మీడియాతో కలిసి థాంక్యూ మీట్ చేయడం జరిగింది. ప్రణవ స్వరూప్ రచన దర్శకత్వంలో రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీ సాయికుమార్ దారా సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగతాన్ని అందించగా శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ చేశారు. సుభాషిని, కొండా లక్ష్మణ్ నిర్మాతలుగా వ్యవహరించారు. శివాజి రాజా, రవి తేజ మహాదశ్యం, ప్రగ్య నయన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ఈ థాంక్యూ మీట్స్ సందర్భంగా హీరో నందు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. మా సినిమాకు మంచి విజయం ఇచ్చినందుకు ముందుగా మీడియా వారికి, ప్రేక్షకులకు థాంక్స్. సినిమా ఉదయంతో పోలిస్తే విడుదల అయిన రోజు సాయంత్రానికి ముందుకు వెళ్ళింది. మా సినిమాకు ఎంతో జెన్యూన్ రివ్యూస్ వచ్చాయి. నన్ను మీ ఇంట్లో మనిషిగా ఫీల్ అయ్యి మా సినిమాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియాకు, ప్రేక్షకులకు చాలా థాంక్స్” అన్నారు.

నందు మాట్లాడుతూ…
* సాధారణంగా కొన్ని సన్నివేశాలు చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాని సినిమాకు ఆ సన్నివేశాలు కావాలి కాబట్టి చేశాము. సినిమా చేసేప్పుడు మేము ఇబ్బంది పడ్డాము కాని సినిమా కోసం చేశాము.

* రీసెంట్ గా వచ్చిన సినిమాలు నాకు మంచి పేరు తెచ్చాయి, నాకు అది సంతోషకరం. దాని వల్ల మంచి కథలు కూడా వస్తున్నాయి.

* ఈ సినిమాలో నా నటన వల్ల నాకు మంచి స్పందన వస్తుంది అని నేను ముందుగానే అనుకున్నాను. అనుకున్నట్లే నాకు ఈ సినిమాతో మంచి పేరు తెచ్చింది.

* ప్రస్తుతం అమ్మాయిలు గతంతో పోలిస్తే బలంగా ఉంటున్నారు. భర్త క్రూరంగా ఉంటే భార్యకు అతడిని భరించవలసి అవసరం లేదు. ఈ విషయంలోను ఆడవారిని సపోర్ట్ చేస్తాను.

* నేను ప్రమోషన్ అలా అగ్రెసివ్ గా చేయకపోతే ఇంతమంది ప్రేక్షకులు వస్తారు అని అనుకోను. ప్రమోషన్స్ అనేది ఏది మన సినిమాను ముందుకు తీసుకుని వెళ్తుందో తెలీదు కాని కచ్చితంగా నా వంత ప్రయత్నం నేను చేస్తాను. నా తర్వాత సినిమాలకు కూడా నేను ఇలాగే ప్రమోషన్ చేస్తాను.

* నేను గతంలో సెలెక్ట్ చేసుకున్న కథలతో పోలిస్తే ఇప్పుడు కథలు సెలెక్ట్ చేయడంలో కొన్ని మార్పులు వచ్చాయి. ఇకపై రానున్న సినిమాలు కుటుంబ సమేతంగా వెళ్ళి చూసేలా ఉంటాయి.

* ఇన్ని సంవత్సరాలుగా నాకు పడిన కష్టంతో పోలిస్తే ఈ సినిమాతో చాలా బాగా పేరు వచ్చింది. నాకు పరిచయం కూడ లేని ఒక వ్యక్తి నాకోసం దేవుడిని నాకు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటే నాకు చాలా ఎమోషనల్ గా అనిపించింది.

* నాకు సాధారణంగా మొహమాటం ఎక్కువ. కాని ఈ ఇండస్ట్రీలో మొహమాటం పడకూడదు అని అర్థం అయింది. నేను ఉన్న అని నేనే దర్శకులకు గుర్తు చేయాలి అని సుకుమార్ గారు చెప్పిన మాట నాకు గుర్తుండిపోయింది.

* ఈ సినిమాలో నా పాత్ర, పెర్ఫార్మెన్స్ కు వచ్చిన స్పందనకు 95% మా దర్శకునికే. సినిమాలో నా క్యారెక్టర్ ఎలా ఉండాలో ఆయన కచ్చితంగా వచ్చేలా చూసుకున్నారు.

* ఈ సినిమా వల్ల వచ్చే కథలకు ఈ పాత్ర ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటే కొంచం ఆలోచించి కథలు సెలెక్ట్ చేసుకుంటాను.

* నేను ఎన్నో సినిమాలు చేసేప్పటికీ ఈ సినిమాలో పాత్ర నేను చేసినప్పుడు షూటింగ్ తర్వాత కూడా కాస్త ఇంపాక్ట్ అనిపించింది.

* నా భార్య గీత సినిమా చూసాక సినిమాలో తనకు నచ్చిన సన్నివేశాలు గురించి చెప్పారు. సినిమాలో పాటలు నచ్చాయి ఆమెకి. ఒక హారర్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది అని ఆమె చెప్పడం ఒక కంప్లైమెంట్ గా అనిపించింది.

* ఈ సినిమా అందరూ సపోర్ట్ చేస్తే ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమా చూస్తుంటే ఒక మలయాళం సినిమాలా అనిపించింది అంటున్నారు.

* సినిమాలో కొన్ని సన్నివేశాలు ఎప్పటికప్పుడు అనుకున్నవి. ఆ సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. నా చిన్నప్పటి పాత్ర చేసిన అతను చాలా బాగా చేశాడు.

దర్శకుడు ప్రణవ స్వరూప్ మాట్లాడుతూ…
* ప్రస్తుతం సమాజంలో చూస్తూ ఉండే కొన్ని విషయాలు చూసి ఈ సినిమా కథను రాశాను.

* ప్రేమ అనేది మారుతూ ఉంటుంది కాని కొన్ని సందర్భాలలో కొంత మంది తప్పక అలా ఉండిపోతారు. నేను ఈ సినిమా ద్వారా అది చెప్పాలి అనుకున్నాను.

* నాకు నందు లాంటి నటుడు దొరకడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నా తర్వాత చిత్రం కూడా ఎమోషన్స్ మీదనే ఉంటుంది.

* సహజంగా మనకు ఇష్టమైన వారు బావుండరు అని కోరుకుంటారు. ఈ సినిమాలో పెళ్లి జరిగేందుకు శివాజీ రాజా గారు కూడా అలాగే ఆలోచిస్తారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ…
* ఈ సినిమా ముందుగా చూసినప్పుడు బావుంది అనిపించింది కాని విడుదల అయిన వెంటనే మీడియా, ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందనకు నాకు ఈ సినిమా మంచి పేరు సాధిస్తుంది అని అనిపించింది. నందుకు ఇప్పటి నుండి సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అనుకోవచ్చు.

* దర్శకుడు నాకు ఎంతోకాలం నుండి పరిచయం. తొలి చిత్రంతోనే ఆయనకు ఇంత మంచి విజయం రావడం సంతోషకరం.

* ఈ సినిమాకు మీడియా అంతా సపోర్ట్ చేసి మరింత విజయం సాధించేందుకు తోడ్పడాలని కోరుకుంటున్నాను.

నటీనటులు : నందు, అవికా గోర్, రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా, ప్రజ్ఞా నయన్ తదితరులు

బ్యానర్ : రియా జియా ప్రొడక్షన్స్
ప్రొడ్యుసర్ : సుభాషిని, కొండా ల‌క్ష్మ‌ణ్
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ప్రణవ స్వరూప్‌
సహ నిర్మాతలు : రాజ్ నాగ్, అశ్విని శ్రీకృష్ణ
కెమెరా: శ్రీసాయికుమార్‌ దారా
ఎడిటింగ్ : శ్రీకాంత్ పట్నాయక్
సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్
ఆర్ట్ డైరెక్టర్ : విఠల్ కోసనం
పి ఆర్ ఓ: మధు వి ఆర్
డిజిటల్ మీడియా : వారే మీడియా , డిజిటల్ దుకాణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here