ZEE5 తెలుగు నుంచి ‘‘మేము కాప్’లం’’ అనే మరో ఒరిజినల్ సిరీస్ వచ్చింది. రా ఎంటర్‌టైన్‌మెంట్స్ (ప్రొడక్షన్ నెం. 3) బ్యానర్‌పై బి.వి.ఎస్. రవి నిర్మించిన ‘‘మేము కాప్’లం’’ సిరీస్‌కు ‘వికటకవి’ ఫేమ్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో నాగబాబు కొణిదెల ప్రధాన పాత్రను పోషించారు. గెటప్ శ్రీను, రవి తేజ నన్నిమాల వంటి ప్రముఖ తారాగణం నటించారు. ఈ సిరీస్ మే 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో గురువారం నాడు గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమన్, బండ్ల గణేష్, అజయ్ భూపతి, కోన వెంకట్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ మేరకు
Telugu ZEE5’s Original “Memu COPulam” Grand Preview Event Playlist
తమన్ మాట్లాడుతూ .. ‘సాకేత్ ఈ ‘‘మేము కాప్’లం’’ సిరీస్‌కు సంగీతం అందించడం ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి సిరీస్‌లు, సినిమాలకు సంగీతం అందిస్తుండటం సంతోషంగా ఉంది. సాకేత్ గారి నాన్నగారు మ్యూజిక్ ప్రపంచానికి ఎంతో సేవ చేస్తున్నారు. ధ్రువన్ పాటలు రాయడం ఆనందంగా ఉంది. రవి గారు తీస్తున్న కనకదుర్గ అమ్మవారి మీద చిత్రానికి పని చేస్తున్నాను. మా కోన అన్న, బండ్ల గణేష్ గారు కూడా ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది. ఈ సిరీస్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
అజయ్ భూపతి మాట్లాడుతూ .. ‘‘‘మేము కాప్’లం’’ అనే టైటిల్ కాంట్రవర్సీ అవుతుందేమో అని అనుకున్నాను. కానీ ట్రైలర్ మాత్రం వినోదాత్మకంగా ఉంది. ఇండస్ట్రీలో రవి గారి హవానే నడుస్తోంది. ‘మంగళవారం’ సినిమాలో గెటప్ శ్రీను నటించాల్సింది. కానీ నేను ఆయన్ను మిస్ చేసుకున్నాను. కామెడీ వెబ్ సిరీస్‌లు చాలా తక్కువగా వస్తున్నాయి. ‘‘మేము కాప్’లం’’ సిరీస్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. 17 రోజుల్లోనే ఇలాంటి క్వాలిటీతో తీయడం అంటే మామూలు విషయం కాదు. మే 22న ఈ సిరీస్ రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ .. ‘ప్రదీప్ నాకు నచ్చాడు. ఆయన తన అమ్మానాన్నను తీసుకు వచ్చి ఇక్కడ కూర్చోపెట్టాడు. అందుకే నాకు ఆయన నచ్చాడు. రవి ఇంత వరకు నాకు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పలేదు. నేను అన్ని విషయాలు చెబుతాను. కానీ రవి మాత్రం నాకు ఈ సిరీస్ గురించి ఇంత వరకు నాకు చెప్పలేదు. అనురాధ మేడం, కౌముది, శ్రీను ఇలా సిరీస్‌కు పని చేసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్. కేవలం 17 రోజుల్లోనే సిరీస్ తీశారంటే నమ్మలేకపోయా. ఈ సిరీస్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
కోన వెంకట్ మాట్లాడుతూ .. ‘అనురాధ మేడం ఎప్పుడూ కూడా మంచి కంటెంట్‌ను ఎంచుకుంటారు. ఇదొక రిఫ్రెషింగ్ కంటెంట్‌లా ఉంది. రవికి అన్ని క్రాఫ్టుల మీద పట్టుంది. మార్కెటింగ్‌లో అందరి కంటే ముందుంటాడు. రవి, కౌముది కలిసి చేసిన ఈ సిరీస్ మంచి విజయం సాధించాలి. ప్రదీప్ మంచి దర్శకుడు. ప్రతీ ఒక్కరికీ ఈ సిరీస్ నచ్చుతుంది. ఈ సిరీస్‌కు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు, సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నిర్మాత కౌముది మాట్లాడుతూ .. ‘మాకు ఈ అవకాశం ఇచ్చిన అనురాధ మేడం గారికి థాంక్స్. ప్రదీప్ గారి వల్లే ఈ ప్రాజెక్ట్ మా వరకు వచ్చింది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. పొలిటికల్ పనుల్లో బిజీగా ఉన్నా మాకు నాగబాబు గారు డేట్స్ అడ్జస్ట్ చేశారు. గెటప్ శ్రీను గారు ఎంత బిజీగా ఉన్నా మాకు డేట్లు ఇచ్చారు. మాకు ఈ ప్రయాణంలో రవి గారు బ్యాక్ బోన్‌లా నిల్చున్నారు. మా సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
నిర్మాత బీవీఎస్ రవి మాట్లాడుతూ .. ‘మాకు అండగా నిలిచన జీ5 టీం, అనురాధ గారికి థాంక్స్. శోభన్, చాణక్య వర్మ ఈ కథను చెప్పారు. ప్రదీప్ నాకు ఆప్తుడు. నా 30 ఏళ్లలో ప్రదీప్ లాంటి ఓ డైరెక్టర్‌ని చూడలేదు. కోడి పోవడం, దాన్ని పట్టుకునేందుకు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు రంగంలోకి దిగుతారు. గెటప్ శ్రీను గొప్ప నటుడు. రవి, శ్రీను కలిసి చేసిన పర్ఫామెన్స్ అదిరిపోతుంది. అన్ని డిపార్ట్మెంట్‌ల సహకారంతోనే 17 రోజుల్లో షూటింగ్ చేశాం. నాగబాబు గారు ఈ ప్రాజెక్ట్‌లోకి రావడంతోనే మా సిరీస్ స్థాయి, విలువ పెరిగింది. సాకేత్ మాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ధ్రువన్ మంచి లిరిక్స్ ఇచ్చారు. మే 22 నుంచి మా సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. మా సిరీస్ ఆనందంగా, ఆహ్లాదంగా, సరదాగా ఉంటుంది. అందరూ చూసి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
జీ5 బిజినెస్ హెడ్ అనురాధ మాట్లాడుతూ .. ‘ఈ ఏడాదిలో మా నుంచి వచ్చిన ప్రతీ కంటెంట్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాం. ‘‘మేము కాప్’లం’’ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఈ సిరీస్ ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. కోడి పందెంలు, సంక్రాంతి సీజన్, గ్రామీణ వాతావరణాన్ని చూపించాం. ప్రదీప్ గారితో, బీవీఎస్ రవి గారితో మా సంస్థకి ఎంతో అనుబంధం ఉంది. మే 22 నుంచి మా సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అందరూ చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ .. ‘‘మేము కాప్’లం’ సిరీస్‌ను ప్రతీ ఒక్కరి సపోర్ట్‌తోనే ఇంత వేగంగా పూర్తి చేయగలిగాం. మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన శోభన్, చాణక్య, కిశోర్, సెల్వ, సాకేత్ ఇతర టెక్నీషియన్లకు, ఆర్టిస్టులందరికీ థాంక్స్. ఈ జర్నీలో అండగా నిలిచిన బీవీఎస్ రవి గారికి, కౌముదికి, అనురాధ గారికి థాంక్స్. చాణక్య మా ‘వికటకవి’కి కూడా స్క్రీన్ ప్లే రాశారు. ప్రదీప్ అంటే రాజ్ కుమార్ కూడా ఉంటాడు. నా డైరెక్షన్ టీంకు థాంక్స్. గెటప్ శ్రీను గారు మాకెంతో సపోర్ట్ చేశారు. నటుడు రవి చాలా మంచి వ్యక్తి. మా జర్నీలో నాగబాబు గారు అండగా నిలిచారు. ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్‌కి ఈ స్థాయి వచ్చింది. మే 22న మా సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ కొమండురి మాట్లాడుతూ .. ‘‘మేము కాప్’లం’’ సిరీస్‌కి పని చేయడం ఆనందంగా ఉంది. రా ఎంటర్టైన్మెంట్స్ నుంచి రవి గారు, కౌముదికి థాంక్స్. ప్రదీప్ గారు చాలా కూల్‌గా ఉంటారు. ధ్రువన్ మంచి లిరిక్స్ ఇచ్చారు. మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. మే 22 నుంచి మా సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
కిరిటీ దామరాజు మాట్లాడుతూ .. ‘‘మేము కాప్’లం’’ సిరీస్‌లో నటించినందుకు ఆనందంగా ఉంది. రా ఎంటర్టైన్మెంట్స్ ఇలానే కొత్త వారికి అవకాశం ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. మరో సీజన్ కూడా త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. మళ్లీ పండగ వచ్చేలోపు ఇంకో సీజన్ రావాలని, అంత పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
రీతూ చౌదరి మాట్లాడుతూ .. ‘జీ5తోనే నా కెరీర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్లీ ఈ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకు వస్తుండటం ఆనందంగా ఉంది. ప్రదీప్ గారు చాలా కూల్ డైరెక్టర్. మాకు ఈ అవకాశం ఇచ్చిన రవి గారు, కౌముది, ప్రదీప్ గారికి థాంక్స్’ అని అన్నారు.
నటుడు రవితేజ మాట్లాడుతూ .. ‘మాలాంటి కొత్త వారిని ఎంకరేజ్ చేస్తున్న జీ5 టీంకు థాంక్స్. గత ఏడాది నాకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దీనావస్థ స్థితిలో ఉన్నప్పుడు బీవీఎస్ రవి గారు వచ్చి నన్ను, శోభన్‌ను పైకి తీసుకు వచ్చారు. మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మే 22 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
గెటప్ శ్రీను మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన కోన గారికి, అజయ్ భూపతి గారికి, బండ్ల గణేష్ గారికి, తమన్ గారికి థాంక్స్. క్రమశిక్షణ ఉంటేనే ఇక్కడ ఉండగలం. బీవీఎస్ రవి గారు అందరినీ ఒకే రకంగా చూస్తుంటారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నటుడు రవి చాలా సెన్సిటివ్ పర్సన్. అతని పర్ఫామెన్స్‌లో కూడా ఆ సున్నితత్వం ఉంటుంది. మాకు కంటిన్యూగా అవకాశం ఇస్తున్న అనురాధ గారికి థాంక్స్. 17 రోజుల్లోనే షూటింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ప్రదీప్ గారికి ప్రతీ ఫ్రేమ్, ప్రతీ క్రాఫ్ట్ మీద క్లారిటీ ఉంటుంది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మే 22న మా సిరీస్ రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
లిరిక్ రైటర్ ఆర్ఆర్ ధృవన్ మాట్లాడుతూ .. ‘‘‘మేము కాప్’లం’’ రేపు రిలీజ్ కాబోతోంది. మా కోసం వచ్చిన కోన వెంకట్ గారు, తమన్ గారు, బండ్ల గణేష్ గారు, అజయ్ భూపతి గారికి థాంక్స్. సాకేత్, కౌముది నాకు బాల్య స్నేహితులు. ఇలాంటి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో మేం అంతా కలిసి ఇలా రావడం ఆనందంగా ఉంది. రేపు రాబోతోన్న ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
కెమెరామెన్ కిషోర్ మాట్లాడుతూ .. ‘‘మేము కాప్’లం’’ సిరీస్‌కి పని చేయడం ఆనందంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన రవి గారు, ప్రదీప్ గారికి థాంక్స్. మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మే 22న మా సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.
ఎడిటర్ మైఖేల్ మాట్లాడుతూ .. ‘‘మేము కాప్’లం’’ సిరీస్‌కి అవకాశం ఇచ్చిన రవి గారు, ప్రదీప్ గారికి థాంక్స్’ అని అన్నారు.
క్రియేటివ్ ప్రొడ్యూసర్ గోపాల కృష్ణ విధ్మహే మాట్లాడుతూ .. ‘‘మేము కాప్’లం’’ సిరీస్‌లో అవకాశం ఇచ్చిన రవి గారు, కౌముది గారికి థాంక్స్’ అని అన్నారు.
స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్ చాణక్య వర్మ మాట్లాడుతూ .. ‘మా లాంటి కొత్త వారికి అవకాశం ఇస్తున్న జీ5 టీంకు థాంక్స్. సొటారి బ్రదర్స్ అనే పాత్రల్ని క్రియేట్ చేసిన శోభన్‌కి థాంక్స్. రవి గారు, ప్రదీప్ గారి వల్లే ఈ సిరీస్ ఇంత బాగా వచ్చింది. 17 రోజుల్లోనే క్వాలిటీతో సిరీస్ తీశాం. మే 22న మా సిరీస్ రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.
స్టోరీ రైటర్ శోభన్ మాట్లాడుతూ .. ‘8 ఏళ్ల క్రితం యూట్యూబ్‌లో జర్నీ స్టార్ట్ చేశాం. సొటారి బ్రదర్స్ అని రవితో కలిసి చేశాను. అదే పాయింట్‌తో ‘‘మేము కాప్’లం’’ అనే సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాను. సాయితేజ్ దేశ్ రాజ్ గారి వల్ల ఈ ప్రాజెక్ట్ ముందుకు కదిలింది. మాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన జీ5 టీంకు థాంక్స్. చాణక్య రావడంతో ఈ ప్రాజెక్ట్ మరింత అందంగా మారింది. బీవీఎస్ రవి గారు, ప్రదీప్ గారు మాకెంతో సపోర్ట్ ఇచ్చారు. మే 22న ఈ సిరీస్ రానుంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.



