గంగా ఎంటర్టైన్మెంట్స్, స్వస్తిక్ విజన్స్ సంయుక్త నిర్మాణంలో కేజేఆర్ హీరోగా తెరకెక్కిన ‘గుర్తింపు’ ట్రైలర్ విడుదల
స్పోర్ట్స్, కోర్ట్ డ్రామాగా గంగా ఎంటర్టైన్మెంట్స్, స్వస్తిక్ విజన్స్ సంయుక్త నిర్మాణంలో కేజేఆర్ హీరోగా ఎస్‌కే ప్రశాంత్, అజిత్ బాస్కర్, అరుణ్ మురుగన్ నిర్మించిన చిత్రం ‘గుర్తింపు’. ఈ మూవీకి జె.పి. తెన్ పతియాన్ దర్శకత్వం వహించారు. దేశంలోని క్రీడా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ పనితీరు, పేదలు క్రీడలకు ఎంత దూరంలో ఉన్నారు అనే విషయాల్ని ఇతివృత్తంగా తీసుకుని ‘గుర్తింపు’ సినిమాని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
‘క్రికెట్ మన నేషనల్ గేమ్’.. ‘హాకీ మన నేషనల్ గేమ్’.. ‘మన దేశానికి నేషనల్ గేమ్ అనేదే లేదు’, ‘మీరందరూ చూసే పది సెకన్లు కాదు సార్ నా జీవితం.. దాని వెనకాల నా 29 ఏళ్ల జీవితం, శ్రమ ఉంది సర్.. మీట్‌కి వెళ్తే గెలుస్తాం.. కానీ అక్కడి వరకు వెళ్లలేకపోతున్నాం’.. ‘మనలాంటి వాళ్లకి గేమ్ మామూలు విషయం కాదు.. అదే మనకు విడుదల’, ‘స్పోర్ట్స్ అని కొడితే క్రికెట్ గురించి మాత్రమే న్యూస్ వస్తుంది’, ‘దేశం కోసం పోరాడే వాళ్లకి మాత్రమే కాదు.. క్రీడాకారులకి కూడా ఎంతో రుణపడి ఉంటుంది’, ‘ఇలాంటి వాళ్లంతా గవర్నమెంట్ ఎంత చేసినా ఏదో ఒక లోటు కనిపెడుతూనే ఉంటారు, ‘అథ్లెటిక్స్‌లో గోల్డ్ గోల్డ్ అని రొమ్ము విరుచుకుని ముప్పావువంతు మెడల్స్ సాధించింది మీరు చెప్పిన ఆ కూటికి దిక్కులేని వాళ్లే మేడం’, ‘నాకున్న ఒకే ఆశ.. నీ తరంలోనే నీ జీవితం మారిపోవాలి’ అంటూ సాగే డైలాగ్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది.
ఈ ట్రైలర్‌ను గమనిస్తే ఓ పేదవాడు అథ్లెటిక్‌గా ఎదిగే క్రమంలో ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు.. ఈ ప్రయాణంలో క్రీడా శాఖ మంత్రిని కోర్టు మెట్లు ఎందుకు ఎక్కించాడు.. అసలు అతనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమస్యలు వచ్చాయి.. కోర్టులో కోరుకున్న న్యాయం దక్కిందా? లేదా? అనే ఉత్సుకత కలిగించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. విజువల్‌గా, సౌండింగ్ పరంగా ట్రైలర్ అదిరిపోయింది.
హీరోగా కేజేఆర్ లుక్స్, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, పర్ఫామెన్స్ ఈ ట్రైలర్‌లో అదిరిపోయింది. ఈ మూవీని జూన్‌లో విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.
నటీనటులు : కేజేఆర్, విజి వెంకటేష్, రంగరాజ్ పాండే, వసుంద్ర, మన్సూర్ అలీ ఖాన్, రామ్‌జీ తదితరులు
సాంకేతిక బృందం
నిర్మాణ సంస్థలు -గంగా ఎంటర్టైన్మెంట్స్, స్వస్తిక్ విజన్స్
నిర్మాతలు- SK ప్రశాంత్, అజిత్ బాస్కర్, అరుణ్ మురుగన్
దర్శకుడు – జె.పి. తెన్ పతియాన్
సంగీతం- గిబ్రాన్ వైబోధ
యాక్షన్- పీటర్ హెయిన్
కెమెరామెన్ – A. విశ్వనాథ్ డీఎఫ్ టెక్
ఎడిటర్ – దినేష్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్ – రాము తంగరాజ్
సౌండ్ డిజైన్- సంపత్ అల్వార్
కొరియోగ్రఫీ- షరీఫ్
పబ్లిసిటీ డిజైన్‌లు- ప్రతూల్ ఎన్‌టి
క్రియేటివ్ ప్రమోషన్‌లు- బీట్‌రూట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – స్పూర్తి కేతినేని



