డా. రాజశేఖర్ ను అభినందించిన “ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్”

0
44
Film Critics Association Congratulated Dr. Rajasekhar
Film Critics Association Congratulated Dr. Rajasekhar

డా. రాజశేఖర్ ను అభినందించిన “ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్”

త్వరలో “డైమండ్ జూబిలీ సెలబ్రేషన్స్” (60 ఏళ్ల సంబరాలు) నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న “ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్” ప్రముఖ కథానాయకుడు డాక్టర్ రాజశేఖర్ ను ఆయన ఇంట్లో మర్యాదపూర్వకంగా కలిసింది. రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన “బైకర్” చిత్రం ఘన విజయం సాధిస్తుండడం పట్ల శుభాకాంక్షలు తెలిపింది.

సీనియర్ జర్నలిస్టులను పేరు పేరున పలకరించిన రాజశేఖర్…, తన కెరీర్ లో మైలురాళ్లుగా నిలిచిన “వందేమాతరం, తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, ఆగ్రహం, మగాడు” నాటి రోజులను ఎంతో ఇష్టంగా నెమరువేసుకున్నారు. ప్రస్తుతం తను చేస్తున్న ఇంకా పేరు పెట్టని రెండు చిత్రాల విశేషాలను కూడా ఆయన ఆత్మీయంగా పంచుకున్నారు!!

రాజశేఖర్ దంపతులను కలిసినవారిలో “ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్” గౌరవాధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు బత్తుల ప్రసాద్, జనరల్ సెక్రటరీ సురేష్ కొండేటి, సీనియర్ సభ్యులు ఎ. బాల్ రెడ్డి, మోహన్ గోటేటి, కార్యవర్గ సభ్యులు మామిడిపల్లి గిరిధర్, ధీరజ అప్పాజీ, జిల్లా సురేష్ ఉన్నారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here