ఘనంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేస్ గుర్రం రీ-రిలీజ్ ఈవెంట్
రేస్ గుర్రం అనే పేరు వినగానే వచ్చే వైబ్‌నే వేరు. విడుదల సమయంలో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ మాత్రం అసాధారణం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, శృతి హాసన్‌ల మధ్య సీన్స్ ఒక ఎత్తు అయితే, అల్లు అర్జున్–బ్రహ్మనందం కాంబినేషన్ సన్నివేశాలు మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి.
అల్లు అర్జున్ బర్త్‌డే స్పెషల్‌గా ఏప్రిల్ 8 న మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి), వెంకటేశ్వర రావు కలిసి శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ సంగీతాన్ని అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.
ఈ రీ-రిలీజ్ బాధ్యతలను క్రౌన్ మూవీస్ తీసుకుని, గ్రాండ్‌గా ఈవెంట్‌ను నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు రఘు బాబు, సీనియర్ కమెడియన్ అలీ, ప్రొడ్యూసర్స్ నల్లమలుపు శ్రీనివాస్, డా. వెంకటేశ్వరరావు, డిస్ట్రిబ్యూటర్లు నారాయణ రావు, సుబ్బారావు హాజరయ్యారు.
అనంతరం వారి మాటల్లో..
డిస్ట్రిబ్యూటర్ నారాయణ రావు మాట్లాడుతూ , “రేస్ గుర్రం టీమ్‌కి నా కృతజ్ఞతలు. ఈ సినిమా మరోసారి ఘన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు” అన్నారు.
క్రౌన్ మూవీస్ సుబ్బారావు మాట్లాడుతూ , “ఈ కార్యక్రమానికి హాజరైన మీడియా మిత్రులకు మరియు నా శ్రేయోభిలాషులకు నా ధన్యవాదాలు. రేస్ గుర్రం సినిమాను మళ్లీ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన బుజ్జి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు” అన్నారు.
నటుడు రఘు బాబు మాట్లాడుతూ , “12 సంవత్సరాల తర్వాత రేస్ గుర్రం మళ్లీ ఏప్రిల్ 8న థియేటర్లలోకి వస్తోంది. అప్పట్లో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ కాగా, ఇప్పుడు ఆయన ఐకాన్ స్టార్‌గా ఎదిగారు. ఆయన ఇమేజ్ ప్రభావాన్ని మళ్లీ చూస్తాం. “అప్పట్లో ‘రేస్ గుర్రం’ హిట్ ఇంకా గుర్తుండే ఉంటుంది, ఏప్రిల్ 8న రేస్ గుర్రం’ రీ-రిలీజ్ 100 రెట్లు ఎక్కువ కమర్షియల్‌గా హిట్ అవబోతోంది. సురేందర్ రెడ్డి గారితో నా అనుబంధం ఎంతో ప్రత్యేకం. ఆయన కోసం నేను ఎలాంటి షరతులు లేకుండా పాత్రలు చేశాను. ఈ సినిమాలో నా పాత్ర చిన్నదైనా మంచి పేరు తెచ్చింది. ఇప్పటికీ కాలేజ్ ఈవెంట్స్‌లో విద్యార్థులు నన్ను గుర్తు చేసుకుంటూ ‘మాస్క్ తీసేయండి’ అని అడుగుతుంటారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన బుజ్జి గారు, సురేందర్ రెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారికి నా కృతజ్ఞతలు” అన్నారు.

నటుడు అలీ మాట్లాడుతూ, “నా కెరీర్ శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతోంది. బుజ్జి అన్న, వెంకటేశ్వరరావు గారు, నారాయణ రావు గారు, అమెరికా సుబ్బారావు గారు, దర్శకుడు సురేందర్ రెడ్డి, థమన్, అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నా కృతజ్ఞతలు. రేస్ గుర్రం విడుదలై 12 సంవత్సరాలు అవుతుందని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఏప్రిల్ 7న అల్లు అరవింద్ గారి పెళ్లి రోజు, వెంకటేశ్వరరావు గారి పెళ్లి రోజు, ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు రావడం ఒక యాదృచ్ఛికం. ‘కిక్’ సినిమాలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన పాత్రకు మంచి స్పందన వచ్చింది. అదే తరహా పాత్ర రేస్ గుర్రంలో కూడా మంచి స్పందన పొందింది. ఈ సినిమా మళ్లీ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత డా. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ , “ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా ప్రతినిధులు, అల్లు అర్జున్ అభిమానులకు నా ధన్యవాదాలు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న రేస్ గుర్రం మళ్లీ విడుదల అవుతోంది. విడుదల సమయంలో ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మొత్తం టీమ్ కృషి వల్లే ఈ విజయాన్ని సాధించింది. ఈ సినిమా టీవీలో వచ్చినప్పుడల్లా కొత్త అనుభూతిని ఇస్తుంది. బన్నీ బాబుకు ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొత్తం నటీనటులు, సాంకేతిక బృందానికి నా కృతజ్ఞతలు” అన్నారు.
నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ మాట్లాడుతూ, “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు” అన్నారు
చిత్రం: రేసుగుర్రం
నటీనటులు: అల్లు అర్జున్, శృతి హాసన్, ‘కిక్’ శ్యామ్, సలోని, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రవి కిషన్, శామ్, తదితరులు…
దర్శకుడు: సురేందర్ రెడ్డి
సంగీత దర్శకుడు: ఎస్. థమన్
నిర్మాత: నల్లమలుపు బుజ్జి
రీ-రిలీజ్: క్రౌన్ మూవీస్



