చిత్ర పరిశ్రమపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు: ఖండించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA)

0
48
Movie Artist Association Strongly Condemns MLA Anirudh Reddy’s Derogatory Remarks Against the Film Fraternity
Movie Artist Association Strongly Condemns MLA Anirudh Reddy’s Derogatory Remarks Against the Film Fraternity

చిత్ర పరిశ్రమపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు: ఖండించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA)

తెలంగాణ ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి ఇటీవల సినీ ప్రముఖులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ప్రెసిడెంట్ విష్ణు మంచు మరియు వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి స్పందించింది.

ఎమ్మెల్యే సూచనపై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వాస్తవాలను గుర్తుచేశారు.

“మంచి సూచన. అయితే, ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ముందు రాజకీయ నాయకులకు ఉండాల్సిన సమానమైన పరీక్ష ఏంటో అని నేను ఆలోచిస్తున్నాను? గౌరవనీయులైన ఎమ్మెల్యే గారితో కలిసి అటువంటి ఉమ్మడి నిబంధనలపై పని చేయడానికి ఓటర్లు ఖచ్చితంగా సంతోషిస్తారు.”

‘మా’ ఉపాధ్యక్షుడు మాదాల రవి మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమ క్రమశిక్షణతో కూడుకున్నదని, ఈ వ్యాఖ్యలు అసహ్యకరమైన ఆధారం లేని మాటలు. సమాజ అభివృద్ధిలో తమ వంతు పాత్రను ఎప్పుడూ పోషిస్తూనే ఉందని ఆయన తెలిపారు.

చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ఉన్నత విద్యావంతులు ఉన్నారని, పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలు అందుకున్న మహనీయులు ఈ రంగంలో ఉన్నారని గుర్తుచేశారు.

ఎన్.టి. రామ రావు, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, కృష్ణం రాజు, చిరంజీవి, మాదాల రంగ రావు, ఆర్. నారాయణ మూర్తి లాంటి దిగ్గజాలు సినిమాల ద్వారా సమాజానికి శక్తివంతమైన సందేశాలను అందించారు. ప్రస్తుత నటులు చాలామంది నేషనల్ మరియు ఇంటర్నేషనల్ లెవెల్ లో పేరు ప్రేఖ్యతలు సంపాదించుకున్నారు.

మాదకద్రవ్యాల నిర్మూలనలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎప్పుడూ ముందుంటుందని మాదాల రవి స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో కలిసి ‘మా’ సన్నిహితంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు.

చిరంజీవి, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి అగ్ర నటులు యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు చురుగ్గా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని గుర్తుచేశారు.

చివరగా, చిత్ర పరిశ్రమ తన సామాజిక బాధ్యతలకు కట్టుబడి ఉంటుందని మరియు డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా అంతం చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here