“” పోలీస్ వారి హెచ్చరిక “” నిర్మాత బెల్లి జనార్ధన్ ఆకస్మిక మృతి

0
39

“” పోలీస్ వారి హెచ్చరిక “” నిర్మాత బెల్లి జనార్ధన్ ఆకస్మిక మృతి…..!

ఇటీవల తూలికా తనిస్క్ క్రియేషన్స్ పతాకంపై “” పోలీస్ వారి హెచ్చరిక “” చిత్రాన్ని నిర్మించడం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన “” బెల్లి జనార్ధన్ “” ఆకస్మిక మరణం పట్ల చిత్ర దర్శకుడు బాబ్జీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరిచారు…..!!

ఈనెల 22 వ తేదీన ఉగాది పండుగ జరుపుకోవడం కోసం
అత్తగారి ఊరైన “” కట్టంగూరు కు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళిన బెల్లి జనార్ధన్ ఆ గ్రామంలో గల స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీటి అడుగుకు బలంగా తల తగిలి తీవ్రoగా గాయమవడంతో అక్కడికక్కడే ఊపిరి వదిలారని , 23 వ తేదీన వారి స్వగ్రామమైన నకిరేకల్ మండలంలోని ” పాలెం ” గ్రామంలో మాజీ సైనికుడైన జనార్ధన్ గారికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయని “” ఆయన తెలిపారు….!

ఈ సందర్భంగా ” పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా యూనిట్ తరుపున , వ్యక్తి గతంగా నా తరుపున నిర్మాత బెల్లి జనార్ధన్ గారి ఆకస్మిక మరణం పట్ల తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తూ వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలుపుకుంటున్నామని ”
దర్శకుడు బాబ్జీ తెలిపారు…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here