మీడియా ప్రొఫెషనల్ మరియు సీనియర్ జర్నలిస్ట్ ఆకుల శ్రీనివాసరావు కు “మయూరి ఆర్ట్స్” ద్వారా ఉగాది నంది పురస్కారం దక్కింది..
రవీంద్రభారతి లో జరిగిన ఈ ఉగాది అవార్డ్స్ ప్రదానం లో.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, మాధురి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియన్ కో ఆర్డినేటర్ బింగి నరేందర్, డేవిడ్ రాజు, “మయూరి ఆర్ట్స్” ఫౌండర్ రాధ, యువ నటి యాని, యువ నటుడు సాయితేజ ల సమక్షంలో ఈ అవార్డ్ ప్రధాన కార్యక్రమం జరిగింది.
ప్రముఖ తెలుగు ప్రింట్ మీడియా లో ముప్పయ్యేళ్ళ పాటు మేనేజర్ స్థాయిలో వివిధ బాధ్యతలు నిర్వహించి.. గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా లో.. ఆపరేషన్స్ హెడ్ గానూ జర్నలిస్ట్ గానూ ఉత్తమ సేవలందిస్తున్నందుకు .. మయూరి ఆర్ట్స్ వారు .. శ్రీనివాసరావును ఉగాది నంది పురస్కారానికి ఎంపిక చేసినట్టు తెలిపారు.
ప్రముఖ సంస్థ మయూరి ఆర్ట్స్ హైదరాబాద్ నగరంలో గత 29 సంవత్సరాల నుంచి వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.




