ఉగాది సందర్భంగా కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ ‘గుమ్మడి నర్సయ్య’ ఫియర్స్ లుక్ రిలీజ్

0
34
Shiva Rajkumar’s Fierce Look As Gummadi Narsaiah
Shiva Rajkumar’s Fierce Look As Gummadi Narsaiah

ఉగాది సందర్భంగా కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ ‘గుమ్మడి నర్సయ్య’ ఫియర్స్ లుక్ రిలీజ్

ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఎన్. సురేష్ రెడ్డి (ఎన్ఎస్ఆర్) నిర్మాతగా పరమేశ్వర్ హివ్రాలే తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుమ్మడి నర్సయ్య’. రాజకీయాల్లో, ప్రజా సేవలో తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్న గుమ్మడి నర్సయ్య బయోపిక్‌గా రాబోతోన్న ఈ సినిమాలో గుమ్మడి నర్సయ్యగా కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే వదిలిన గ్లింప్స్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో భారీ అంచనాల్ని నెలకొల్పింది. ఇక ఇప్పుడు ఉగాది సందర్భంగా ఓ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్ కనిపిస్తున్న తీరు, భుజంపై ఆ కండువా? పిడికిలి బిగించిన విధానం, ఆయన లుక్స్ ఇలా అన్నీ కూడా ఎంతో ఇంటెన్స్‌గా కనిపిస్తున్నాయి. గుమ్మడి నర్సయ్య పాత్రకు శివన్న ప్రాణం పోస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తెలుగు ప్రేక్షకుల్నే కాకుండా భారతీయ సినీ ప్రేమికులందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ మూవీకి సిద్దగాని సాయి కిరణ్ గౌడ్, చింతకింది రూప కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమాకి సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్‌గా, సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడిగా, సత్య గిడుటూరి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, మలయాళీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

నటీనటులు:

డా. శివ రాజ్‌కుమార్

సాంకేతిక బృందం:

బ్యానర్: ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్
నిర్మాత: ఎన్. సురేష్ రెడ్డి (NSR)
దర్శకుడు: పరమేశ్వర్ హివ్రాలే
డీఓపీ: సతీష్ ముత్యాల
ఎడిటర్: సత్య గిడుతూరి
సంగీత దర్శకుడు: సురేష్ బొబ్బిలి
పీఆర్‌ఓ: సాయి సతీష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here