న్యూ కాన్సెప్ట్‌ మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ది రైజ్‌ ఆఫ్‌ అశోక్‌’ ట్రైలర్‌ విడుదల

0
22
‘The Rise of Ashoka’ Trailer Released
‘The Rise of Ashoka’ Trailer Released

న్యూ కాన్సెప్ట్‌ మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ది రైజ్‌ ఆఫ్‌ అశోక్‌’ ట్రైలర్‌ విడుదల

సతీష్‌ నీనసాం కథానాయకుడిగా ‘కాంతార’ ఫేమ్‌ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘ది రైజ్‌ ఆఫ్‌ అశోక’. కన్నడ, తెలుగు,తమిళ భాషలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి వినోద్‌.వి.దుండలే దర్శకుడు. వృద్ది క్రియేషన్స్ అండ్‌ సతీష్‌ పిక్చర్‌ హౌస్‌ పతాకంపై వర్ధన్‌ హరి, జైష్ణవి, సతీష్ నీనసాం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో కళాసృష్టి ఇంటర్నేషనల్‌ పతాకంపై రవిశంకర్‌ తెలుగులో ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పంపిణి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 27న ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కాబోతుంది. కాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ విడుదల కార్యక్రమం శుక్రవారం చిత్ర టీమ్‌ సమక్షంలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కథానాయకుడు సత్యదేవ్‌ హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్బంగా సత్యదేవ్‌ మట్లాడుతూ ” ” తెలుగు ప్రేక్షకులు కంటెంట్‌ సినిమాలను ఆదరిస్తారు. ఈ సినిమాను కూడా ఆదరిస్తారు. ట్రైలర్‌ చూసి మా ఆడియన్స్‌ ఈ సినిమా చూడాలని డిసైడ్‌ అయ్యారు. కన్నడ నుంచి వచ్చే రూటెడ్‌ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు ఇష్టం. తప్పకుండా ఈ సినిమా కూడా అదే కోవలోకి వస్తుందని అనుకుంటున్నాను. నా సినిమా జీబ్రా కన్నడ విడుదల సమయంలో సతీష్‌, సప్తమి నాకు సపోర్ట్‌ చేశారు. సతీష్‌ మంచి నటుడు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఈ సినిమా దర్శకుడు ఈ సినిమా షూటింగ్‌ సమయంలో మరణించాడు. అప్పుడు సతీష్‌ ఈ సినిమాను పూర్తిచేసి ఈ స్టేజ్‌కు తీసుకొచ్చారు. కన్నడ సినిమాలు రూటెడ్‌గా ఉన్న వాటికి తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ది రైజ్‌ ఆఫ్‌ అశోక్‌ కూడా ఆ కోవలోకి తెచ్చిందే. తెలుగు ఆడియన్స్‌ మంచి కంటెంట్‌ ఇస్తే విజయాన్ని ఇస్తారు. హీరోయిన్‌ సప్తమి తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

హీరో సతీష్‌ నీనసాం మాట్లాడుతూ ” తెలుగు భాష అంటే నాకు ఎంతో గౌరవం. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. రవిశంకర్‌ ఈ సినిమా చూసి తెలుగులో విడుదల చేస్తున్నారు. మా కోసం ఆయన ఎంతో రిస్క్‌ చేసి రిలీజ్‌చేస్తున్నారు. సత్యదేవ్‌ నా సోదరుడు ఎంతో మంచి మనసు మనిషి.ఆయన సినిమా జీబ్రా కన్నడ విడుదల సమయంలో కలిశాను. ట్రైలర్‌ చూస్తే అందరికి సినిమాలో కంటెంట్‌ ఉన్న సినిబమా అని తెలుస్తుంది. కంటెంట్‌ సినిమాను అందరూ ఆదరించాలి. నేను తెలుగు సినిమాలు చూస్తుంటాను. కొత్తదనం ఉండే ఇక్కడి ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తారు. మా సినిమాపై కూడా అదే నమ్మకం. తెలుగులో వస్తున్న ది రైజ్‌ ఆఫ్‌ అశోక సినిమాను ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇది కేవలం కమర్షియల్‌ సినిమానే కాదు. ఎంతో డిఫరెంట్‌ ఫిలి’ అన్నారు.

సప్తమి గౌడ మాట్లాడుతూ ” అందరికి ఈ ట్రైలర్‌ నచ్చిందని అనుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకుల సపోర్ట్‌ మాకు కావాలి. మా ట్రైలర్‌ను విడుదల చేసి, మమ్ములను ఎంకరైజ్‌ చేస్తున్న సత్యదేవ్‌ గారికి కృతజ్క్షతలు. ది రైజ్‌ ఆఫ్‌ అశోక్‌ అనేది ఓ గ్రామం గురించి, ఓ కమ్యూనిటీ గురించి కథ. ఈ సినిమాలో చాలా ఎమోషన్స్‌ ఉన్నాయి. తెలుగు నేటివిటికి కూడా దగ్గరగా ఉండే సినిమా ఇది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఈసినిమాను ఎంజాయ్‌ చేస్తారు. ఈ సినిమాలో అంబిక అనే అమ్మాయి పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమాలో ఎంతో గొప్ప మేసేజ్‌ ఉంది. ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది’ అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ” తెలుగు ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. ఈ నెల 27న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో గ్రాండ్‌ ఈ సినిమాను విడుదల చేస్తున్నాం అన్నారు

కళా సృష్టి అధినేత రవిశంకర్‌ మాట్లాడుతూ ” ఏపీ, తెలంగాణతో పాటు ఒరిస్సాలో నా సంస్థ ద్వారా విడుదల చేస్తున్నాను. చాలా కొత్తగా ఉండే సినిమా ఇది. ఈ సినిమాను నేను తెలుగులో విడుదల చేయడం ఎంతో గర్వంగా ఉంది. తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ అయ్యే సినిమా ఇది అన్నారు.

సతీష్‌ నీనసాం, సప్తమి గౌడ, బి.సురేష్‌, సంపత్‌, మైత్రేయ, గోపాలకృష్ణ, దేశ్‌పాండే, యాశ్‌ శెట్టి, జగ్గప్ప, రవిశంకర్‌, డ్రాగన్‌ మంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ: లవిత్‌, సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి

Banner: Vriddhi Creation And Sathish Picture House
Producer: Vardhan Hari – Jaishnavi – Sathish Ninasam
Director: Vinod V Dhondale
Cast: Sathish Ninasam, Sapthami Gowda, B.Suresh, Sampath
Maithreya, Gopal Krishna Deshapande, Yashh Shetty, Jagappa,
Ravishankar (Armugha), Dragon Manju,
Dop: Lavith
Music Director: Poornachandra Tejaswi
Art Director: Hosmane Murthy, Janardhan Kukke
Editor: Manu Shedgar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here