డే 1 వరల్డ్ వైడ్ 1.89 కోట్ల వసూళ్లు దక్కించుకున్న “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా

0
57
“Couple Friendly” Collects ₹1.89 Crores Worldwide on Day 1
“Couple Friendly” Collects ₹1.89 Crores Worldwide on Day 1

డే 1 వరల్డ్ వైడ్ 1.89 కోట్ల వసూళ్లు దక్కించుకున్న “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా రీసెంట్ గా థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు డే 1 వరల్డ్ వైడ్ 1.89 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రావడం విశేషం. హార్ట్ టచింగ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన “కపుల్ ఫ్రెండ్లీ” మూవీ అందరి ప్రశంసలతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

“కపుల్ ఫ్రెండ్లీ” చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేశారు.

నటీనటులు – సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ – మైఖేల్ బీఎఫ్ఏ
ఎడిటర్ – గణేష్ శివ
డీవోపీ – దినేష్ పురుషోత్తమన్
మ్యూజిక్ – ఆదిత్య రవీంద్రన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ఎస్ వర్మ
సమర్పణ – యూవీ క్రియేషన్స్
నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ రాజు. పి.
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన, దర్శకత్వం – అశ్విన్ చంద్రశేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here