అమర్దీప్ చౌదరి “సుమతీ శతకం” లవ్ సాంగ్ ‘ఎక్కడే ఎక్కడే’ తొలి మెలోడి సాంగ్ రిలీజ్

0
39
Amardeep Chowdary’s Sumathi Shatakam First Melody ‘Ekkade Ekkade’
Amardeep Chowdary’s Sumathi Shatakam First Melody ‘Ekkade Ekkade’

అమర్దీప్ చౌదరి “సుమతీ శతకం” నుండి ‘ఎక్కడే ఎక్కడే’ తొలి మెలోడి సాంగ్ రిలీజ్

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సుమతీ శతకం. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నహిద్ మహమ్మద్ ఎడిటింగ్ చేయగా ఎస్ హలేష్ సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్ & టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.

ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఈ చిత్రం నుండి ‘ఎక్కడే ఎక్కడే’ పాటను మేకర్స్ విడుదల చేశారు. తిరుపతి జావన రాసిన ఈ పాటకు ధనుంజయ్ సీపన తన స్వరాన్ని జోడించి అద్భుతంగా పాడారు. ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ద్వారా ఆదిత్య మ్యూజిక్ లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.

ఇక ఈ పాట విషయానికి వస్తే ఎక్కడే ఎక్కడే అంటూ మొదలైన ఈ పాట మంచి మెలోడి రూపంలో లవ్ సాంగ్ అని అర్థం అవుతుంది. ఎంతో అర్థమంతమైన లిరిక్స్ ఉన్న ఈ పాట త్వరలోనే మంచి చార్ట్బస్టర్ గా చిత్రానికి ప్లస్ గా నిలుస్తుంది అని తెలుస్తుంది.

నటీనటులు : అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి, టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు.

సాంకేతిక నిపుణులు :
రచన, దర్శకత్వం : ఎంఎం నాయుడు
నిర్మాత : సాయి సుధాకర్ కొమ్మాలపాటి
బ్యానర్ : విజన్ మూవీ మేకర్స్
సమర్పణ : కొమ్మలపాటి శ్రీధర్
సినిమాటోగ్రాఫర్ : ఎస్ హలేష్
ఎడిటర్ : నహిద్ మహమ్మద్
సంగీతం : సుభాష్ ఆనంద్
డైలాగ్స్ : బండారు నాయుడు
పిఆర్ఓ : మధు విఆర్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here