మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రెస్టీజియస్ మూవీ “వృష‌భ‌” నుంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ‘చిన్ని చిన్ని..’ రిలీజ్

0
61
Love song titled “Chinni Chinni” From Vrusshabha

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రెస్టీజియస్ మూవీ “వృష‌భ‌” నుంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ‘చిన్ని చిన్ని..’ రిలీజ్

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న ప్రెస్జీజియస్ మూవీ “వృష‌భ‌”. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఈ నెల 25న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తోంది. “వృష‌భ‌” చిత్రాన్ని కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు. విమ‌ల్ ల‌హోటి స‌హ నిర్మాత‌గా వ్యవహరిస్తున్న “వృష‌భ‌” సినిమాను దర్శకుడు నందకిషోర్ మ‌ల‌యాళం, తెలుగులో రూపొందించారు. ఈ రోజు “వృష‌భ‌” సినిమా నుంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ‘చిన్ని చిన్ని..’ రిలీజ్ చేశారు.

సమర్జీత్ లంకేష్, నయన్ సారికపై చిత్రీకరించిన ఈ లవ్ సాంగ్ కు కల్యాణ్ చక్రవర్తి క్యాచీ లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి మంచి లవ్ ఫీల్ తో పాడారు. సామ్ సీఎస్ ఛాట్ బస్టర్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. ‘చిన్ని చిన్ని..’ లిరికల్ సాంగ్ ఎలా ఉందో చూస్తే – ‘ ఎవ్వరే నువ్వెవ్వరే చెప్పవే ఓ దేవత, ఏమిటే ఇదేమిటే ఓ మాయగా ఉన్నదే, ఏ శరానివో నీవు, ఏ స్వరానివో నీవు, ఓ వరానివో నీవు, తేలే వీలే లేదే, నా ప్రయాణమే మారి, నీ పదాలలో చేరి, నా ప్రపంచమే నువ్వైతివే, ఎవ్వరే నువ్వెవ్వరే, నీ ఆలోచనే నా ఆలాపనైపోయో, చిన్ని, చిన్ని నా చిన్ని చిన్ని నా కన్నీ నువ్వే అయిపోయావే..’ అంటూ సాగుతుందీ పాట.

పునర్జన్మల నేపథ్యంతో హై టెక్నికల్ వ్యాల్యూస్, స్టార్ కాస్టింగ్ తో విజువల్ వండర్ గా “వృష‌భ‌” సినిమా ప్రేక్షకుల్ని అలరించబోతోంది.

నటీనటులు – మోహన్ లాల్, స‌మ‌ర్జీత్ లంకేష్‌, రాగిణి ద్వివేది, న‌య‌న్ సారిక‌, అజ‌య్‌, నేహా స‌క్సేనా, గ‌రుడ రామ్‌, విన‌య్ వ‌ర్మ‌, అలీ, అయ‌ప్ప పి.శ‌ర్మ‌, కిషోర్, తదితరులు

టెక్నికల్ టీమ్
——————
ఎడిటింగ్ – కేఎమ్ ప్రకాష్
సినిమాటోగ్రఫీ – ఆంటోనీ సామ్ సన్
స్టంట్స్ – పీటర్ హెయిన్స్, స్టంట్ సిల్వ, నిఖిల్
సౌండ్ డిజైన్ – రసూల్ పూకుట్టి
డైలాగ్స్ -ఎస్ ఆర్ కే, జనార్థన మహర్షి, కార్తీక్
మ్యూజిక్ – సామ్ సీఎస్, అరియన్ మెహెదీ
రిలీజ్ – గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్స్ – కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్
ప్రొడ్యూసర్స్ – శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా
కో ప్రొడ్యూసర్ – విమల్ లహోటి
డైరెక్టర్ – నందకిషోర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here