‘ఓహ్’ (OH) మూవీ రివ్యూ

0
294

‘ఓహ్’ (OH) మూవీ రివ్యూ

మూవీ : “ఓహ్” (Oh)
బ్యానర్ : ఏకారి ఫిలిమ్స్
సమర్పణ : జీవిత బడుగు
తారాగణం : రఘు రామ్, శృతి శెట్టి, నైనా పాఠక్, కల్పగురి బిక్షపతి, మనోజ్, కరణ్, తదితరులు
సంగీతం :నవనీత్ చారి,
పాటలు : భాష్య శ్రీ
సినిమాటోగ్రఫీ : లక్కీ ఏకారి
కో- ప్రొడ్యూసర్స్: పి శ్రీకాంత్ రెడ్డి, వి రాఘవ్ రెడ్డి
కొరియోగ్రాఫర్ : రాజు మాస్టర్ (యస్. డి. సి )
కథ, కథనం, మాటలు: రఘు రామ్
దర్శక, నిర్మాత : సత్యనారాయణ ఏకారి,

రఘు రామ్ హీరోగా పరిచయం అవుతూ ఓహ్ (Oh), తానే సొంతగా కథ అందించిన సినిమా ఓహ్. ఏకరి సత్యనారాయణ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ సినిమాలో శృతిశెట్టి, నైనా పాఠక్ హీరోయిన్స్ గా నటించారు. ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా నేడు (డిసెంబర్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? కథ ఏంటి? ఏమేరకు ఆకట్టుకుంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం

కథ:

హీరో కృష్ణ (రఘురామ్), కావ్య (శృతి శెట్టి) అనే అమ్మాయితో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే, హీరోకి ‘క్రోమోఫోబియా’ అనే వింత సమస్య ఉంటుంది. ఆ కారణంగా అప్పటికే దృశ్య (నైనా) అనే మరో అమ్మాయితో ఉన్న బంధాన్ని గుర్తుంచుకోలేకపోతాడు. ఒకవైపు గుర్తులేని గతం, మరోవైపు ప్రాణప్రదమైన ప్రస్తుత ప్రేమ, ఈ రెండింటి మధ్య కృష్ణ పడే సంఘర్షణే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. ఆ సమస్యను భారతీయ పురాణాలు, ప్రాచీన విజ్ఞానాన్ని ఉపయోగించి ఎలా అధిగమించాడు అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు:

కృష్ణ పాత్రలో రఘు రామ్ బాగా ఆకట్టుకున్నాడు. సంఘర్షణకి గురయ్యే యువకుడిగా, ప్రేమికుడిగా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించాడు. ఎమోషనల్ సీన్స్ ను అద్భుతంగా పండించాడు. హీరోయిన్లు శృతి శెట్టి, నైనా పాఠక్ ఇద్దరూ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. సెంటిమెంట్ తో పాటు, రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా వీరు ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేర నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు

దర్శకుడు ఏకరి సత్యనారాయణ వైవిధ్యమైన పాయింట్ ను ఎంగేజింగ్ గా డీల్ చేశారు. రఘురామ్ రాసిన కథ, ఎంచుకున్న పాయింట్ చాలా వైవిధ్యంగా ఉండటమే గాక ఇప్పుడు వస్తున్న ప్రేమకథలకు భిన్నంగా ఉంది. సైన్స్‌ను, మన ప్రాచీన విజ్ఞానాన్ని మేళవించి కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. నవనీత్ చారి అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. భాష శ్రీ రాసిన పాటలు అర్ధవంతంగా ఉన్నాయి. ఏకరి ఫిల్మ్స్ బ్యానర్‌పై రాజీ పడకుండా ఈ చిత్రాన్ని క్వాలిటీగా నిర్మించారు. విజువల్స్ బాగున్నాయి.

విశ్లేషణ:

కథ బ్యాక్ గ్రౌండ్ మనాలిలో జరగడం సినిమాకు మారింత అందాన్ని తెచ్చింది. మంచుతో కప్పబడిన పర్వతాలు, లోయలు, నదులు, దట్టమైన అడవుల దృశ్యాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. విజువల్ గా కూడా సినిమా ఆకట్టుకుంటుంది. పురాతన శాస్త్రాలకు, ఆధునిక ప్రేమకు మధ్య ఒక ప్రయాణంగా తెరకెక్కిన ‘ఓహ్’ (OH) చిత్రం కేవలం ఒక ప్రేమకథగానే కాకుండా, భారతీయ పురాణాలు ప్రాచీన విజ్ఞానాన్ని జోడించి తీసిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది.

ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే కథలోని సస్పెన్స్‌ను మరికొంత కొనసాగించి ఉంటే బాగుండేదనిపించింది. ముఖ్యంగా కథానాయకుడికి ఉన్న ఫోబియా గురించి ఒక ట్విస్ట్ లాగా కథాగమనంలో రివీల్ చేసుంటే మరింత బాగుండేది. అలాగే, ఫైట్ సీక్వెన్స్‌లు కూడా ఇంటెన్సిటీ తో తీసుండాల్సింది. వైవిధ్యం తో కూడిన కథే ‘ఓహ్’ (OH) చిత్రాన్ని నిలబెట్టింది. కేవలం యువతకే కాకుండా, మన సంస్కృతిని, విజ్ఞానాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా. వినూత్నమైన కథాంశంతో ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త ఫీల్‌ని అందిస్తుందనడంలో సందేహం లేదు. కుటుంబం అంతా కలిసి చూడదగ్గ ఒక చక్కని రొమాంటిక్ డ్రామా ఇది.

రేటింగ్ :2.25/5

చివరగా: ప్రాచీన సంస్కృతి, ఆధునిక ప్రేమ ల విభిన్న మేళవింపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here