రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా మారియో ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 19న మూవీ గ్రాండ్ రిలీజ్

0
34
Ram Gopal Varma Launched Gripping Trailer Of Mario

రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా మారియో ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 19న మూవీ గ్రాండ్ రిలీజ్

మనసుకు హత్తుకునే కథ, డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న సినిమాలకు ఏ రేంజ్ ఆదరణ దక్కుతుందో చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలే సూపర్ డూపర్ హిట్ సాధిస్తున్నాయి. అదే బాటలో సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మారియో మూవీ. ‘నాటకం’, ‘తీస్ మార్ ఖాన్’ వంటి డిఫరెంట్ చిత్రాలతో దర్శకుడిగా మెప్పు పొందిన కళ్యాణ్ జీ గోగణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీతం అందిస్తున్నారు. ‘ఎ టర్బో-చార్జ్డ్ ర్యాంప్ రైడ్’ అనే ట్యాగ్‌ లైన్‌తో రాబోతున్న ఈ సినిమాలో హీరోగా అనిరుధ్, హీరోయిన్ గా హెబ్బా పటేల్ కనిపించనున్నారు.

ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేపడుతూ ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్స్, టీజర్, ఇతర వీడియోస్ భారీ రెస్పాన్స్ అందుకోగా.. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. భారతీయ సినిమాకు పయనీర్‌గా పేరొందిన రామ్ గోపాల్ వర్మ అధికారికంగా ఈ ట్రైలర్‌ను విడుదల చేయడంతో మరింత హైప్‌ వచ్చేసింది. విడుదల చేసిన కాసెట్లోనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రైలర్‌ విడుదల అనంతరం మారియో సినిమా టీమ్ ని ప్రశంసించారు ఆర్జీవీ. ఈ సినిమాలో చూపించిన కథనం కట్టిపడేసేలా ఉందని అభినందించారు. కథను ఆకర్షణీయంగా, ఎంగేజింగ్‌గా చూపించిన డైరెక్టర్ కల్యాణ్‌జీ గోగుణ పనిని ఆయన ప్రశంసించారు.

సూపర్ మారియో గేమ్ అంటే 90’s లో సూపర్ ఫేమస్. అదే సూపర్ మారియో పొట్టోడి మాటలతో ట్రైలర్ స్టార్ట్ చేసి ఆధ్యంతం ఆసక్తికర సన్నివేశాలతో కట్ చేశారు. 3 నిమిషాల 23 సెకనుల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ లో హెబ్బా పటేల్ అందాలు హైలైట్ అయ్యాయి. అనిరుధ్ పాత్ర కూల్ అండ్ కంపోజ్డ్ అని తెలుస్తోంది. డ్రగ్స్ నేపథ్యంతో కూడిన ఈ కథలో నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అంశాలు ఉండటమే గాక, విలువైన సందేశం కూడా ఉందని చెప్పేలా ఈ ట్రైలర్ డిజైన్ చేశారు. డ్రగ్స్, ఆల్కహాల్, సెక్స్ ఈ మూడింటి చుట్టూ అల్లిన ఈ కథలో ఊహించని ట్విస్టులు ఏమో ఉన్నాయని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. చివరలో అదే సూపర్ మారియో పొట్టోడితో వీడియో ముగించి సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ 19 అని చెప్పడం ఆసక్తికరం.

ఇప్పటికే మారియో మూవీ నుంచి వచ్చిన అన్ని అప్ డేట్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేయగా.. తాజాగా వదిలిన ట్రైలర్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించి సినిమాపై అంచనాలు పెంచేసింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్‌గా కమర్షియల్ జానర్‌లో రాబోతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. నేటితరం ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలతో పాటు ఆద్యంతం వినోదాత్మకంగా మారియో చిత్రం ఉండబోతోందని ఈ ట్రైలర్ స్పష్టం చేసింది. ఈ ట్రైలర్ లో ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా గ్రాండ్‌గా కనిపించాయి.

ఈ సినిమాలో అనిరుధ్, హెబా పటేల్, రాకేందు మౌళి, మౌర్య సిద్ధవరం, యష్నా ముతులూరి, కల్పిక గణేష్, మదీ మన్నెపల్లి, లతా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. MN రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా.. మణికాంత్, మదీ మన్నెపల్లి ఎడిటర్లుగా వ్యవహరించారు.

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్లు: సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్
కథ, దర్శకత్వం : కళ్యాణ్‌ జీ గోగణ
రచనా సహకారం, పాటలు : రాకేందు మౌళి
సంగీత దర్శకులు : సాయి కార్తీక్, రాకేందు మౌళి
సినిమాటోగ్రాఫర్: ఎంఎన్ రెడ్డి
ఎడిటర్: మణికాంత్, మదీ మన్నెపల్లి
PRO : సాయి సతీష్
పోస్టర్ డిజైనర్: పార్ధు క్రియేషన్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here