Jigris : జిగ్రీస్ మూవీ రివ్యూ.. హిట్టా.. ఫట్టా?

0
105

 

కృష్ణ బూరుగుల, రామ్ నితిన్,ధీరజ్ ఆత్రేయ, మని వాక లీడ్ రోల్స్ లో కృష్ణ వోడపల్లి నిర్మించిన చిత్రం జిగ్రీస్ హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు స్టార్ సర్కిల్ మీడియా డిజిటల్ మీడియా ప్రమోషన్స్ నిర్వహించింది. హీరోయిన్, గ్లామర్ డోస్ లేని సినిమా గురువారం ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ : కార్తిక్ (కృష్ణ బూరుగుల ) ప్రవీన్ (రామ్ నితిన్), వినయ్ (ధీరజ్ ఆత్రేయ), ప్రశాంత్ (మని వాక) నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. అయితే వీరందరూ కలిసి మారుతీ 800 లో గోవా వెళ్లాలని ఓ రాత్రి తాగిన మైకంలో అనుకున్నదే తడవుగా బయలుదేరతారు. మార్గమధ్యంలో కారు ట్రబుల్ ఇస్తుంది. దాన్ని రిపేర్ చేసే క్రమంలో సినిమాలో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ వస్తుంది. అక్కడి నుండి తిరిగి ప్రయాణమైన వీరు చివరుకు గోవా చేరుకున్నారా..? అసలు ఆ చిన్న కారులోనే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. గోవాలో ఏం చేసారు. ఆ ప్రయాణం వీరి జీవితంలో తీసుకువచ్చిన మార్పులేంటి అనేది మిగిలిన కథ..

విశ్లేషణ : టైటిల్ కి తగ్గట్టే ఇది నలుగురు జాగ్రీస్ కథ. ఇలాంటి సినిమాలలో కథ అంతగా ఉండదు. ఉండాల్సిందల్లా కామెడీ. ప్రతీ సీన్ ని హిలేరియస్ మెప్పించాలి. ఒకొక్క సీన్ పేర్చుతూ వెళ్లి నవ్వించగలిగితే చాలు సినిమా నిలబడుతుంది. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. ముఖ్యంగా లారీ సీన్, ఓ ఊర్లో నాటుకోడి ఎపిసోడ్ నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా కాండోమ్ సీన్ హిలేరియస్ గా నవ్విస్తుంది. మావోయిస్టుల బ్లాక్ కూడా ఓ మాదిరిగానే మెప్పిస్తుంది.
జిగ్రీస్.. కథలో అహా ఓహో అనే మలుపులు ఉండవు. కాని అరే మన గ్యాంగ్ కూడా ఇలాంటిదే కదా, మన ఫ్రెండ్స్ కూడా ఇలాంటి వాళ్ళే కద అనిపిస్తుంది. మన కథని మనం తెరపై చూసుకుంటున్నట్టు ఉంటుంది. కాని చివర 15 నిమిషాలు మాత్రం మనసుని ఎంతో బరువెక్కిస్తుంది. అలా జరగకుండా ఉంటే బాగుండేది కదానిపిస్తుంది. తడిసిన కళ్లతో చెమర్చిన భావోద్వేగంతో బయటకు వస్తారు.

ఎవరెలా చేసారంటే.. లీడ్ రోల్ చేసిన కృష్ణ బూరుగుల పర్ఫార్మెన్స్ బాగుంది. సినిమాని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు స్టీల్ చేసాడు. రామ్ నితిన్ పర్లేదు బానే చేసాడు. ధీరజ్ ఆత్రేయచాలా సహజంగా, అమాయమైన నటనతో కామెడీ పండించాడు. మనీ వాక సినిమాలో కీలకమైన పాత్ర, అసలు కథ మెుత్తం తన చుట్టూనే తిరుగుతుంది. అయితే ఎమోషన్ సీన్స్ నటనలో అనుభవం ఇంకొంత అవసరం. సినిమాటోగ్రఫీ కలర్ఫుల్ గా బాగుంది. కమ్రాన్ మ్యూజిక్ గుడ్. ప్రోడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

ఓవరాల్ : జిగ్రీస్.. సరదాగా, హాయిగా నవ్వుకునే దోస్త్ గాళ్ళ సినిమా..

Rating : 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here