సియాటెల్‌లో వినాయకచవితి లడ్డూ వేలం దక్కించుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు

0
136
Pawan Kalyan Fans Win Laddu Auction for 3 Lakhs at Seattle Vinayaka Chavithi
Pawan Kalyan Fans Win Laddu Auction for 3 Lakhs at Seattle Vinayaka Chavithi

సియాటెల్‌లో వినాయకచవితి లడ్డూ వేలం దక్కించుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు

అమెరికా సియాటెల్ మహానగరంలో ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగిన 11 రోజుల వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంలో పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొని, లడ్డూను రూ.3 లక్షలకు దక్కించుకుని భక్తులకు పంచారు.

ఈ సందర్భంగా అభిమానుల్లో ఒకరైన అశోక్ గల్లా గారు మాట్లాడుతూ, రాబోయే పవన్ కళ్యాణ్ గారి OG’ సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మేము లడ్డూ వేలంలో పాల్గొన్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ కమ్మిలి, భాస్కర్ గంగిపాముల, కృష్ణ ఉంగరాల, జనార్ధన్ చక్కా, రాజేష్ అర్జా, అశోక్ పసుపులేటి, లక్ష్మీనారాయణ ముమ్మిడి, హర్షా రేఖానా, శివ నరాలశెట్టి, నవీన్ గంధం, సతీష్ బత్తిన.తదితరులు పాల్గొన్నారు.

ఉత్సవాలను నిర్వహించిన నాసా సంస్థ ప్రతినిధులు వినోద్ పర్ణా, శ్రీరామ్ సుంకరి, రాజా చౌదరి, వినయ్ రెడ్డి, రామ్ బోండా, అజయ్ మెతుకుల, సతీష్ చిగుళ్లపల్లి, శాంతి కుమార్, సీతారాం పెమ్మరాజు, శ్రీకాంత్ మొగరాల, సుహాగ్ గండికోట, సొమా జగదీష్, నితీష్, నరేంద్ర, మాట్లాడుతూ – వేలంలో వచ్చిన మొత్తాన్ని సియాటెల్ కేన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇస్తామని ప్రకటించారు.

అలాగే, గత 11 రోజులుగా ప్రతిరోజూ సాయంత్రం ఐదు వందల మందికి పైగా భక్తులకు మహాప్రసాదం పంచినట్లు పేర్కొన్నారు. విశ్వప్రసాద్ గారి సహకారం ఉత్సవాల విజయానికి కీలకమని వారు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here