“లిటిల్ హార్ట్స్” సినిమా టీమ్ కు “టూరిస్ట్ ఫ్యామిలీ” మూవీ డైరెక్టర్ అభిషాన్ జీవింత్ ప్రశంసలు

0
127
“Tourist Family” Director Abhishan Jeevinth Praises Little Hearts
“Tourist Family” Director Abhishan Jeevinth Praises Little Hearts
“లిటిల్ హార్ట్స్” సినిమా టీమ్ కు “టూరిస్ట్ ఫ్యామిలీ” మూవీ డైరెక్టర్ అభిషాన్ జీవింత్ ప్రశంసలు

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన “లిటిల్ హార్ట్స్” సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. “లిటిల్ హార్ట్స్” సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

తాజాగా ఈ చిత్రానికి సూపర్ హిట్ మూవీ “టూరిస్ట్ ఫ్యామిలీ” డైరెక్టర్ అభిషాన్ జీవింత్ ప్రశంసలు దక్కాయి. “లిటిల్ హార్ట్స్” సినిమాను చూశాను, ఫ్రెండ్స్ , ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాల్సిన క్యూట్ ఫన్ మూవీ అంటూ ఆయన సోషల్ మీడియా పోస్ట్ చేశారు. “లిటిల్ హార్ట్స్” సినిమా 3 రోజుల్లో 12.21 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.

నటీనటులు – మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులు

టెక్నికల్ టీమ్

రచన, దర్శకత్వం – సాయి మార్తండ్
ప్రొడ్యూసర్ – ఆదిత్య హాసన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
మ్యూజిక్ – సింజిత్ యెర్రమల్లి
సినిమాటోగ్రఫీ – సూర్య బాలాజీ
ఎడిటర్ – శ్రీధర్ సొంపల్లి
ఆర్ట్ డైరెక్టర్ – దివ్య పవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – వినోద్ నాగుల, మురళి పున్న
డిస్ట్రిబ్యూషన్ – బన్నీవాస్, వంశీ నందిపాటి
డిస్ట్రిబ్యూషన్ బ్యానర్స్ – బీవీ వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here