స్టార్ హీరో కిచ్చా సుదీప్ భారీ పాన్ ఇండియా మూవీ “మార్క్” టైటిల్ గ్లింప్స్ రిలీజ్

0
71

స్టార్ హీరో కిచ్చా సుదీప్ భారీ పాన్ ఇండియా మూవీ “మార్క్” టైటిల్ గ్లింప్స్ రిలీజ్, ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న సినిమా

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్న 47వ చిత్రానికి “మార్క్” టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. “మార్క్” చిత్రాన్ని టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్యజ్యోతి ఫిలింస్, కిచ్చా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సెంథిల్, త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భారీ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు విజయ్ కార్తికేయా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. “మార్క్” సినిమా ఈ క్రిస్మస్ పండగకు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 

“మార్క్” సినిమా టైటిల్ గ్లింప్స్ పవర్ ఫుల్ గా ఉండి ఆకట్టుకుంటోంది. మ్యాడ్, ఆటిట్యూడ్, రూత్ లెస్, కింగ్…అంటూ మార్క్ పేరులోని అక్షరాలకు డెఫనేషన్ ఇచ్చారు. ఈ గ్లింప్స్ లో అజయ్ మార్కండేయ పాత్రలో కిచ్చా సుదీప్ ను ఇంటెన్స్ లుక్ లో పరిచయం చేశారు. ఆయన క్యారెక్టర్ పేరుతోనే టైటిల్ “మార్క్” ఉండబోతోంది. ఈ గ్లింప్స్ కు అజనీష్ లోకనాథ్ అందించిన బీజీఎం ఆకర్షణగా నిలుస్తోంది. కిచ్చా సుదీప్ కెరీర్ లో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “మార్క్” సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

నటీనటులు – కిచ్చా సుదీప్, విక్రాంత్, నవీన్ చంద్ర, దీప్షిక, రోహిణీ ప్రకాష్, తదితరులు

టెక్నికల్ టీమ్

డీవోపీ – శేఖర్ చంద్ర

ఎడిటర్ – ఎస్ఆర్ గణేష్ బాబు

కొరియోగ్రాఫీ- శోభి పాల్ రాజ్

యాక్షన్ – సుప్రీమ్ సుందర్, కెవిన్ కుమార్, విక్రమ్ మోర్

మ్యూజిక్ – అజనీష్ లోకనాథ్

సమర్పణ – టీజీ త్యాగరాజన్

బ్యానర్స్ – సత్యజ్యోతి ఫిలింస్, కిచ్చా క్రియేషన్స్

నిర్మాతలు – సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్

రచన, దర్శకత్వం – విజయ్ కార్తికేయా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here