జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు… మనోళ్లలో ఏడుగురు విజేతలు

0
232

 

జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. ప్రేక్షకుల మెచ్చే పాన్ ఇండియా సినిమాలు తీయడం మాత్రమే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించే చిత్రాలు అందించడమే కాదు అవార్డులు అందుకోవడం కూడా తెలుగు సినిమాకు తెలుసని టాలీవుడ్ నిరూపించింది. 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు.‌ అందులో తెలుగు సినిమాకు మొత్తం 7 అవార్డులు వచ్చాయి.

నరసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన భగవంతు కేసరికి ఉత్తమ తెలుగు సినిమాగా అవార్డు దక్కింది. బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు పాటకు గాను లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ ఉత్తమ గేయ రచయితగా అవార్డు అందుకోనున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ ఆక్షన్ డైరెక్టర్లు నందు పృథ్వీకి సైతం అవార్డు దక్కింది. బేబీ సినిమాలోని ప్రేమిస్తున్నా పాట పాడిన రోహిత్ విపిఎస్ఎన్ ఉత్తమ గాయకుడిగా నిలవగా… ఆ సినిమాకు గాను స్క్రీన్ ప్లే విభాగంలో దర్శకుడు సాయి రాజేష్ అవార్డు అందుకోనున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డిని ఉత్తమ బాల నటి పురస్కారం వరించింది‌ గాంధీ తాత చెట్టు సినిమాలోని నటనకు ఆమెను పురస్కారం వరించింది. యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్ విభాగంలోనూ హనుమాన్ మరో అవార్డు అందుకుంది. మొత్తం మీద తెలుగు సినిమాకు ఏడు అవార్డులు లభించాయి. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన హిందీ సినిమా ‘యానిమల్’కు గాను ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో తెలుగువాడు హర్షవర్ధన్ రామేశ్వర్ అవార్డు అందుకోనున్నారు. మరో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తీసిన ‘సార్’‌ / తమిళంలో ‘వాతి’కి‌ గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా జీవి ప్రకాష్ కుమార్ నిలిచారు.

ఉత్తమ నటుడిగా షారుఖ్… విక్రాంత్!
ఉత్తమ నటీనటుల విషయానికి వస్తే… ‘జవాన్’ సినిమాకు గాను షారుఖ్ ఖాన్, 12త్ ఫెయిల్ సినిమాకు గాను విక్రాంత్ మాసే జాతీయ అవార్డును పంచుకోనన్నారు. మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాలో నటనకు గాను రాణి ముఖర్జీ ఉత్తమ నటిగా ఎంపిక అయ్యారు. ది కేరళ స్టోరీని తెరకెక్కించిన సుదీప్తో సేన్ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. జవాన్ సినిమాలో చెలియా పాట పాడిన శిల్పారావు ఉత్తమ నేపథ్య గాయనిగా ఎంపిక అయ్యారు. తమిళంలో పార్కింగ్ ఉత్తమ చిత్రంగా నిలిచింది.

c5c8a6e3-aee8-42c9-8120-9db87cfae680 2f52ec9f-292e-4f89-81b2-8b07bc54ae2d 6fe36edf-829a-40c4-8e1d-b51458296ddc af205e00-dbeb-4b7a-b802-36fad452c145 cffd0d06-743c-4b8c-a9bb-85fc44db27f5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here