జూనియర్ నుంచి వైరల్ వయ్యారి సాంగ్ రిలీజ్

0
240
Junior Kireeti Sreeleela Viral Vayyari
Junior Kireeti Sreeleela Viral Vayyari

వైరల్ చార్ట్‌బస్టర్ ఆఫ్ ది ఇయర్- కిరీటి రెడ్డి, శ్రీలీల, రాధా కృష్ణ, వారాహి చలన చిత్రం జూనియర్ నుంచి వైరల్ వయ్యారి సాంగ్ రిలీజ్

ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, తన డెబ్యు మూవీ ‘జూనియర్’ హైలీ ఎంటర్టైనింగ్ టీజర్‌లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. రాధా కృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ జూలై 18న విడుదల కానుంది. మేకర్స్ ప్రమోషన్లలో డోస్ పెంచారు.

ఒక పాట బిగ్ హిట్ అయి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించినప్పుడు, అది వైరల్ పాట అనే లేబుల్‌ను సంపాదిస్తుంది. కానీ జూనియర్ విషయంలో మాత్రం… ఇక్కడ వైరల్ అవుతోందది పాట మాత్రమే కాదు హీరోయిన్ శ్రీలీ. సెకండ్ సాంగ్‌ వైరల్ వయ్యారికి  కొత్త ఇమేజ్‌ ఇచ్చింది శ్రీలీల.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మాస్ ఎనర్జీతో నిండిన కంపోజిషన్ ఇచ్చారు. సాంగ్ అదిరిపోయింది. DSP, హరిప్రియ ఇద్దరూ పాడిన స్టైల్ సాంగ్‌ని ఇంకో లెవల్‌కి తీసుకెళ్లింది. లిరిక్ రైటర్ కళ్యాణ్ చక్రవర్తి కూడా సూపర్ మోడర్న్ టచ్ ఇచ్చారు. యూత్‌తో కనెక్ట్ అయ్యేలా సోషల్ మీడియా లాంగ్వేజ్, ట్రెండీ ఫ్రేసెస్ తో  హైలైట్ అయింది.

కిరీటి రెడ్డి, శ్రీలీల కలిసి డాన్స్ అదరగొట్టారు. కిరీటి స్టెప్పుల్లో గ్రేస్ చూపిస్తే, శ్రీలీల త‌న అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌, ఎలిగెన్స్‌తో ఆకట్టుకుంది. అందమైన సెట్స్‌లో షూట్ చేసిన వైరల్ వయ్యారి పాట క్యాచి మ్యూజిక్, ట్రెండీ లిరిక్స్, కలర్ ఫుల్ విజువల్స్ తో ఈ సాంగ్ ఈ ఏడాది వైరల్ చార్ట్‌బస్టర్ హిట్ కానుంది.  

ఈ సినిమాకి కె.కె. సెంథిల్ కుమార్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్, పీటర్ హెయిన్  యాక్షన్ కొరియోగ్రఫీ, నిరంజన్ దేవరమనే ఎడిటర్. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని డైలాగ్ అందిస్తున్నారు.

తారాగణం: కిరీటి, శ్రీలీల, జెనీలియా, డాక్టర్ రవిచంద్ర వి  
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రాధా కృష్ణ
నిర్మాత: రజనీ కొర్రపాటి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: KK సెంథిల్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
స్టంట్ డైరెక్టర్: పీటర్ హెయిన్
డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని
ఎడిటర్: నిరంజన్ దేవరమానె
కాస్ట్యూమ్స్: నీతా లుల్లా
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి, శ్రీమణి
పీఆర్వో: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here