ప్రముఖ కమెడియన్ అలీ క్లాప్ తో లాంఛనంగా ప్రారంభమైన “చండీ దుర్గమా” సినిమా

0
204
Chandi Durgama Movie Launched
Chandi Durgama Movie Launched

ప్రముఖ కమెడియన్ అలీ క్లాప్ తో లాంఛనంగా ప్రారంభమైన “చండీ దుర్గమా” సినిమా

మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో పాటు నూతన నటీనటులను పరిచయం చేస్తూ హెచ్ బి జె క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా చండీ దుర్గమా. ఈ సినిమాకు జయశ్రీ వెల్ది నిర్మాత. ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైను ఖాన్ ఎండీ దర్శకత్వం వహిస్తున్నారు. చండీ దుర్గమా సినిమా పూజా కార్యక్రమాలతో ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కమెడియన్ అలీ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. కెమెరా స్విచ్ ఆన్ నటుడు చిట్టి చేయగా, ముహూర్తపు సన్నివేశానికి రఘు కారుమంచి దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా….

ప్రముఖ కమెడియన్ అలీ మాట్లాడుతూ – చండీ దుర్గమా సినిమా ప్రారంభోత్సవానికి అతిథిగా రావడం సంతోషంగా ఉంది. అమ్మవారి కథతో వస్తున్న సినిమా కాబట్టి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందాలి. ప్రొడ్యూసర్ జయశ్రీ గారికి, డైరెక్టర్ మైను ఖాన్ తో సహా టీమ్ అందరికీ మంచిపేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

డైరెక్టర్ మైను ఖాన్. ఎండీ. మాట్లాడుతూ – ఈ రోజు మా చండీ దుర్గమా చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చి క్లాప్ కొట్టిన అలీ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. రఘు కారుమంచి, చిట్టి కూడా మాకు సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. ఇటీవల అమ్మవారి నేపథ్యంగా సినిమాలు రూపొందడం లేదు. సౌందర్య గారి అమ్మోరు, విజయశాంతి గారి చండీ సినిమా తర్వాత అమ్మవారి కథతో సినిమా రాలేదు. ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా, ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా డార్క్ థీమ్ లో సరికొత్త స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ తో చండీ దుర్గమా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రస్తుతం థియేటర్స్ కు ప్రేక్షకులు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్స్ కు ఆడియెన్స్ ను రప్పించేలా చండీ దుర్గమా సినిమా మేకింగ్ ను డిజైన్ చేస్తున్నాం. కో ప్రొడ్యూసర్ ఒలీ గారు చెప్పిన ఒక పాయింట్ ఆధారంగా ఈ చిత్ర కథను నేను రాశాను. ఇటీవల కాలంలో ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. చండీ దుర్గమా సినిమా ఒక మాస్టర్ పీస్ అవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

Chandi Durgama Movie Launched
Chandi Durgama Movie Launched

నిర్మాత జయశ్రీ వెల్ది మాట్లాడుతూ – అమ్మవారి నేపథ్యంతో ఒక మంచి కథతో చండీ దుర్గమా సినిమాను నిర్మించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. మన తెలుగు ఆడియెన్స్ అమ్మవారి నేపథ్యంగా వచ్చిన చిత్రాలను ఎంతో ఆదరించారు. మా సినిమాకు కూడా అలాంటి సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాం. హై క్వాలిటీ మేకింగ్ తో మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు, ప్రతిభ గల కొత్త నటీనటులతో చండీ దుర్గమా సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.

సినిమాటోగ్రాఫర్ వైఎస్ కృష్ణ మాట్లాడుతూ – చండీ దుర్గమా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మా మూవీని విజువల్స్ పరంగా కొత్తగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాం. అన్నారు.

నటుడు చిట్టి మాట్లాడుతూ – చండీ దుర్గమా సినిమా ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చి క్లాప్ ఇచ్చిన మా స్నేహితుడు అలీ గారికి థ్యాంక్స్. మైను ఖాన్ మంచి విజన్ ఉన్న డైరెక్టర్. ఆయనతో నేను గతంలో ఓ చిత్రానికి పనిచేశాను. ఈ చిత్రాన్ని అందరికీ నచ్చేలా రూపొందించబోతున్నాడు. నిర్మాత జయశ్రీ గారికి, కో ప్రొడ్యూసర్ ఒలి గారికి మిగతా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

Chandi Durgama Movie Launched
Chandi Durgama Movie Launched

నటుడు రఘు కారుమంచి మాట్లాడుతూ – చండీ దుర్గమా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియా మిత్రులకు థ్యాంక్స్. ఈ సినిమాతో డైరెక్టర్ మైను ఖాన్, నిర్మాత జయశ్రీ గారు మంచి విజయాన్ని దక్కించుకోవాలని కోరుతున్నా. టీమ్ లోని అందరికి నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. చండీ దుర్గమా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండే మూవీ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

కో ప్రొడ్యూసర్ ఒలి మాట్లాడుతూ – థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో చండీ దుర్గమా చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సరికొత్త స్క్రీన్ ప్లేను ఈ చిత్రంలో చూస్తారు. మా డైరెక్టర్ మైను ఖాన్ సినిమాను బాగా రూపొందిస్తాడనే నమ్మకం ఉంది. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.

త్వరలో నటీనటులను ప్రకటించనున్న ఈ చిత్రానికి ఎడిటింగ్, మ్యూజిక్ – ఎంకే, సినిమాటోగ్రఫీ – వైఎస్ కృష్ణ, కో ప్రొడ్యూసర్ – ఒలి, ప్రొడ్యూసర్ – జయశ్రీ వెల్ది, రచన, దర్శకత్వం – మైను ఖాన్ ఎండీ

Chandi Durgama Movie Launched
Chandi Durgama Movie Launched

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here