సూపర్ హిట్ సాధించిన నాని హిట్ 3
నాని సక్సెస్ మారథాన్ హిట్: ది థర్డ్ కేసుతో కొనసాగుతోంది, బాక్సాఫీస్ వద్ద టెర్రిఫిక్ కలెక్షన్స్ తో సూపర్ హిట్ గా అవతరించింది. కొన్ని లోపాలు అక్కడక్కడ మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, నాని స్టార్ పవర్ మరియు ఫెరోసియస్ యాక్షన్ ఈ చిత్రం సూపర్ హిట్ సాధించడానికి ప్రధాన కారణాలు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి వారం రికార్డు వసూళ్లు సాధించడమే కాకుండా, చాలా మంది బయ్యర్స్ జీఎస్టీ లేకుండా బ్రేక్ఈవెన్ సాధించారు, మరికొందరు జిఎస్టీతో బ్రేక్ఈవెన్ సాధించారు.
మొదటి వారంలో హిట్ 3 సాధించిన బ్రేక్ఈవెన్ , ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయల వాటాను సేకరించి 100 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. మొదటి వారాంతం తర్వాత ఈ చిత్రం కొంత డ్రాప్ చూసినప్పటికీ, స్టెడీగా వెళుతోంది. ఈ వీకెండ్ లో మరిన్ని లాభాలను తెచ్చి పెట్టే దిశగా హిట్ 3 అక్క్యుపెన్సీ లు ఉంటున్నాయి.
ఈ చిత్ర విజయానికి నాని స్టార్డమ్ మరియు నటన ప్రధాన కారనాలని చెప్పవచ్చు. బలమైన మొదటి వారం ప్రదర్శనతో, హిట్ 3 బాక్సాఫీస్ వద్ద విజయాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉంది. నాని హిట్ 3 బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించడమే కాకుండా, స్లంప్ లో ఉన్న టాలీవుడ్ కి కొత్త ఊపిరి అందించింది.