మండాడి నుండి సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

0
260
Mandaadi Telugu First Look
Mandaadi Telugu First Look

సూరి, మతిమారన్ పుగళేంది, ఆర్‌ఎస్ ఇన్‌ఫోటైన్‌మెంట్ ప్రెజెంట్స్ – మండాడి నుండి సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్‌ అధినేత ఎల్రెడ్ కుమార్ తన 16వ ప్రాజెక్ట్ గా “మండాడి” అనే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను ప్రకటించింది. “సెల్ఫీ” సినిమాతో తన ప్రతిభను నిరూపించుకున్న దర్శకుడు మతిమారన్ పుగళేంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రధాన పాత్రలో నటుడు సూరి కనిపించనున్న ఈ చిత్రంలో తెలుగులో మంచి గుర్తింపు పొందిన సుహాస్ తన తమిళ అరంగేట్రం చేస్తున్నారు. కథానాయికగా మహిమా నంబియార్ నటిస్తున్నారు. అన్ని భాషల్లోను ఆకట్టుకునేలా చిత్రాన్ని మలుస్తున్నారు.

ఇటీవల టైటిల్ మరియు సూరి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన నిర్మాతలు, తాజాగా సుహాస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. లుంగీ ధరించి, నెరిసిన జుట్టుతో, జెర్సీ వేసుకుని “సునామీ రైడర్స్” బృందంతో సముద్రతీరంలో నిలిచిన సుహాస్ రూపం అభిమానులను ఆకట్టుకుంటోంది. మరో పోస్టర్‌లో సూరి, సుహాస్ ఇద్దరూ స్వయంగా పడవలు నడుపుతూ ఒకరికి ఒకరు వ్యతిరేకంగా కనిపించడం సినిమాలో వారి మధ్య జరిగే గట్టి పోరును సూచిస్తోంది. సుహాస్ ఈ చిత్రంలో బలమైన ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.

Mandaadi Telugu First Look
Mandaadi Telugu First Look

ఈ చిత్రంలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ వంటి అద్భుత నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. క్రీడా నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని, బలమైన భావోద్వేగాలు, సంకర్షణలతో కూడిన ఈ సినిమా జీవన పోరాటం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.

కథను బలంగా ముందుకు నడిపించడంలో టాప్-టియర్ సాంకేతిక బృందం కీలకపాత్ర పోషిస్తోంది: సంగీతం జి.వి. ప్రకాష్ కుమార్ సమకూరుస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా ఎస్.ఆర్. కతిర్ ఐ.ఎస్.సి. పని చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్ డి.ఆర్.కె. కిరణ్, ఎడిటర్ ప్రదీప్ ఇ. రాఘవ్. యాక్షన్ కొరియోగ్రఫీని లెజెండరీ పీటర్ హెయిన్, సౌండ్ డిజైన్‌ను ప్రతాప్ అందిస్తున్నారు. ఆర్. హరిహర సుతాన్ VFX బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు.

తారాగణం: సూరి, సుహాస్, మహిమ నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ తదితరులు

దర్శకత్వం: మతిమారన్ పుగళేంది
నిర్మాత: ఎల్రెడ్ కుమార్
సహ నిర్మాత: వి.మణికందన్
కాస్ట్యూమ్ డిజైన్: దినేష్ మనోహరన్
డాన్స్ కొరియోగ్రాఫర్: అజర్
అదనపు రచన: R. మోహనవసంతన్ & తిరల్ శంకర్
మేకప్: ఎన్.శక్తివేల్
కాస్ట్యూమర్: నాగు
DI: క్లెమెంట్
పబ్లిసిటీ స్టిల్స్: కబిలన్
స్టిల్ ఫోటోగ్రాఫర్: జి. ఆనంద్ కుమార్
పబ్లిసిటీ డిజైన్: ఏస్తెటిక్ కుంజమ్మ
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎస్.పి.చొక్కలింగం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి. మహేష్
PRO: సాయి సతీష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here