విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ ప్రాజెక్ట్ లో శాండల్‌వుడ్ డైనమో విజయ్ కుమార్ 

0
6
Vijaykumar In PuriSethupathi Project
Vijaykumar In PuriSethupathi Project
విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, పూరి కనెక్ట్స్ అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎలక్ట్రిఫైయింగ్ క్యారెక్టర్ లో శాండల్‌వుడ్ డైనమో విజయ్ కుమార్ 
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ తో ఇండియన్ సినిమాని మరోసారి షేక్ చేయడానికి సిద్ధంగా వున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ , చార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో టబు కీలక పాత్ర పోషించనుంది.
ఎక్సయిట్మెంట్ ని మరింత పెంచుతూ, శాండల్‌వుడ్ డైనమో విజయ్ కుమార్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రని పోషించడానికి ప్రాజెక్ట్ లోకి వచ్చారు. మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, హై-ఆక్టేన్ పెర్ఫార్మెన్స్‌లతో అడగొట్టే విజయ్ కుమార్ బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి తర్వాత చేస్తున్న రెండో తెలుగు సినిమా ఇది. 
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నెవర్ బిఫోర్ క్యారెక్టర్ కనిపించబోతున్నారు. విజయ్ సేతుపతి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్, డిఫరెంట్ అవతార్ లో చూడబోతున్నారు ఆడియన్స్. ఈ ప్రాజెక్ట్ తో  తెలుగు సినిమాకి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తున్న టబు కథలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు, విజయ్ కుమార్ ప్రాజెక్ట్ లోకి రావడంతో ఎక్సయిట్మెంట్ మరింతగా పెరిగింది. 
ఈ హైలీ యాంటిసిపేటెడ్ సినిమా కోసం పూరి జగన్నాధ్ పవర్ ఫుల్ కథ ని రాశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ భాషలలో విడుదల కానుంది.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభమవుతుంది  
తారాగణం: విజయ్ సేతుపతి, టబు, విజయ్ కుమార్
సాంకేతిక సిబ్బంది:
రచన,దర్శకత్వం : పూరి జగన్నాథ్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
CEO: విషు రెడ్డి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here