‘ప్రేమంటే’ థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

0
245
Premante Schedule Wrap
Premante Schedule Wrap

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల, నవనీత్ శ్రీరామ్, రానా దగ్గుబాటి, జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు మూవీ ‘ప్రేమంటే’ థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

ఎక్సయిటింగ్ లైనప్ తో అలరిస్తున్న ప్రియదర్శి, రానా దగ్గుబాటి, జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు క్రేజీ కొలాబరేషన్ లో చేస్తున్న సినిమా ‘ప్రేమంటే’.”థ్రిల్-యూ ప్రాప్తిరస్తు” అనేది ట్యాగ్‌లైన్‌. ట్యాలెంట్ యాక్టర్ ఆనంది, ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ తో నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా డెబ్యు చేస్తున్నారు. ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందిన తర్వాత జాన్వి నారంగ్ ఫస్ట్ ప్రొడక్షన్ వెంచర్ ఇది.

తాజాగా ఈ చిత్రం థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రధాన తారాగణం పాల్గొన్న ఈ షెడ్యూల్ చాలా కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (SVCLLP) బ్యానర్ల పై నిర్మిస్తున్నారు, స్పిరిట్ మీడియా దీనిని సమర్పిస్తోంది. ఈ చిత్రం ఎక్సయిటింగ్ సినిమా ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.

ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు, అన్వర్ అలీ ఎడిటర్.

నటీనటులు: ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్
నిర్మాతలు: జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు
సమర్పణ: రానా దగ్గుబాటి
బ్యానర్లు: SVCLLP, స్పిరిట్ మీడియా
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హ్యాష్‌ట్యాగ్ మీడియా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here