‘మహాకాళి’ చిత్రంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా  

0
269
Akshaye Khanna In Mahakali
Akshaye Khanna In Mahakali
RKD స్టూడియోస్ నిర్మాణంలో ‘మహాకాళి’ చిత్రంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా  
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)ను ప్రేక్షకులను పరిచయం చేసిన ‘హను-మాన్’ పాన్-ఇండియా విజయం తర్వాత, ఈ ఫ్రాంచైజీలోని నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం దేశవ్యాప్తంగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇంతకు ముందు ప్రకటించిన మూడవ ప్రాజెక్ట్ మహాకాళి PVCU లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. RKD స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది.
లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, ఇటీవల ‘చావా’లో తన పవర్ ఫుల్ నటనతో చెరగని ముద్ర వేసిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా మహాకాళి తారాగణంలో చేరబోతున్నారు. ఈ చిత్రంలో అతని సూపర్ హీరో యూనివర్స్ కి కొత్త కోణాన్ని, డెప్త్ యాడ్ చేయబోతోంది. 
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ‘మహాకాళి’ ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది, పౌరాణిక ఇతివృత్తాలను వినూత్నమైన సూపర్ హీరో కథలతో బ్లెండ్ చేస్తుంది. దర్శకుడు, కీలక తారాగణం, సహా మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో రివిల్ చేయనున్నారు.
తారాగణం: అక్షయ్ ఖన్నా
సాంకేతిక సిబ్బంది:
షోరన్నర్: ప్రశాంత్ వర్మ
బ్యానర్: RKD స్టూడియోస్
పీఆర్వో: వంశీ శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here