సినిమా పార్టీలు మరియు ఫంక్షన్లకై ప్రత్యేక ప్యాకేజీలో ఫుడ్ డెలివరీ ఈట్జ్ అడ్డా

0
342
Eatz Adda Food Delivery
Eatz Adda Food Delivery

సినిమా పార్టీలు మరియు ఫంక్షన్లకై ప్రత్యేక ప్యాకేజీలో ఫుడ్ డెలివరీ

తమదైన ముద్రకై ఆహార రంగంలోకి అడుగుపెట్టిన ఈట్జ్ అడ్డా

ఆహార రంగంలో ఎన్నో బ్రాండ్స్ ఆవిర్భవించినా కొన్ని బ్రాండ్స్ మాత్రమే తమదైన ముద్రని వేసుకొని తమ ప్రస్థానాన్ని దశాబ్దాల పాటు కొనసాగిస్తూ సమాజంలో అనుసంధానమై తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. అలాంటి విశిష్టతను పొంది రాష్ట్ర దేశ విదేశాలలో తమ ఈట్జ్ అడ్డా బ్రాండ్ విశ్వవ్యాప్తితం కావడమే కాకుండా వేలాది మందికి ఉద్యోగ వ్యాపార అవకాశాల వేదికగా సమున్నత స్తానాన్ని పొందాలన్న ఆశయంతో ఈట్జ్ అడ్డా బ్రాండ్ ని ప్రారంభించామని వ్యవస్థాపకులు, హిమ బిందు, సందు ప్రవీణ్ కుమార్, చెరుకూరి వెంకట సాయి నరసింహ రాజు లు పేర్కొన్నారు.

ఆహార రంగంలో మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభందం కలిగిన కీర్తి ఫుడ్స్ అదినేత సాయి రాజు గారితో కలిసి వ్యాపార వేత్త సందు ప్రవీణ్ కుమార్ మరియు ఎన్ ఆర్ ఐ హిమ బిందు లు ఈట్జ్ అడ్డా పేరుతో ఓ ఫుడ్ బ్రాండ్ కి శ్రీకారం చుట్టి గచ్చిబౌలి డీ ఎల్ ఎఫ్ కార్నర్ ఫుడ్ కోర్ట్ లో తొలి బ్రాంచ్ ని ప్రారంభించారు.ఈ సందర్భంగా యాజమాన్య సభ్యులు మాట్లాడుతూ నాణ్యమైన దేశవిదేశీ రుచులను అందించుటయే కాక వేలాది మందికి వ్యాపార ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న సుదీర్ఘ లక్ష్యంతో ఈట్జ్ అడ్డాకి శ్రీకారం చుట్టామని, సినిమా పార్టీలు మరియు ఫంక్షన్లకై ప్రత్యేక ప్యాకేజీలో ఫుడ్ డెలివరీ చేయనున్నామని అలాగే రుచితో పాటు శుచిని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించుటయే తమ సంస్థ ఆశయమని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here