ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా ఉగాది వేడుకలు, ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజుకు ఘన సన్మానం

0
198
Ugadi Celebrations At FNCC
Ugadi Celebrations At FNCC

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా ఉగాది వేడుకలు, ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజుకు ఘన సన్మానం

హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ కేశిరెడ్డి శివారెడ్డి, ట్రెజరర్ జూజాల శైలజ, ఎంసీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, భాస్కర్ నాయుడు, జె. బాలరాజు, ఏడిద రాజా, వేణు, కోగంటి భవానీ, తదితరులు పాల్గొన్నారు. అలాగే కల్చరల్ కమిటీ ఛైర్మన్ ఎ గోపాలరావు, కల్చరల్ కమిటీ అడిషనల్ ఛైర్మన్ సురేష్ కొండేటి, కల్చరల్ కమిటీ మెంబర్స్ పద్మజ, శివ తదితరుల ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Ugadi Celebrations At FNCC
Ugadi Celebrations At FNCC

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎఫ్ డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారికి ఘన సన్మానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సీసీ మాజీ ప్రెసిడెంట్ కేఎల్ నారాయణ, ఎఫ్ఎన్ సీసీ మాజీ సెక్రటరీ రాజశేఖరరెడ్డి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, డా. కె. వేంకటేశ్వరరావు, ఎఫ్ఎన్ సీసీ గత కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Ugadi Celebrations At FNCC
Ugadi Celebrations At FNCC

ఈ సందర్భంగా ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు మాట్లాడుతూ – ఎఫ్ఎన్ సీసీ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది. ఈ రోజు నిర్మాత , ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు గారిని సత్కరించుకోవడం ఆనందంగా ఉంది. ఆయన చిన్న సినిమాలు పెద్ద సినిమాలు నిర్మిస్తూ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీ అభివృద్ధిలో భాగమవుతున్నారు. అలాగే థియేటర్స్ నిర్మాణంతో ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూట్, ఎగ్జిబిట్ చేస్తూ సినిమాను ప్రేక్షకులకు మరింత విస్తృతంగా చేరేలా కృషి చేస్తున్నారు. ఎఫ్ డీసీ ఛైర్మన్ గా ఇండస్ట్రీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి ఆయన తన వంతు ప్రయత్నం చేయడం అభినందనీయం. ఎఫ్ ఎన్ సీసీ లీజ్ గడువు మరో మూడేళ్లలో ముగుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ లీజ్ ను పొడగించాలని కోరుకుంటున్నా. సీఎం గారు కూడా మన క్లబ్ మెంబరే. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు డెవలప్ చేయాలనుకుంటున్న ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాలతో ఫిల్మ్ సిటీ కూడా నిర్మిస్తే ఇండస్ట్రీలో రాబోయే తరాల వారికి ఉపయోగకరంగా ఉంటుంది. దిల్ రాజు గారు ఆ ప్రయత్నం కూడా ప్రభుత్వంతో మాట్లాడి చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

Ugadi Celebrations At FNCC
Ugadi Celebrations At FNCC

ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ – ఎఫ్ ఎన్ సీసీ మనకున్నబెస్ట్ క్లబ్. సిటీ మధ్యలో ఉంటూ మనకు వ్యాయామం, ఎంటర్ టైన్ మెంట్ కోసం బాగా ఉపయోగపడుతోంది. నేను 1996 లో ఎఫ్ ఎన్ సీసీ క్లబ్ సభ్యత్వం తీసుకున్నా. అప్పటి నుంచి దాదాపు ఈ 30 ఏళ్లలో ఎఫ్ఎన్ సీసీ ఎంతో అభివృద్ధి చెందింది. అందుకు కేఎల్ నారాయణ గారు, కేఎస్ రామారావు గారు వారి కమిటీ సభ్యులు ఎంతో కృషి చేశారు. కేఎస్ రామారావు గారు చెప్పినట్లు ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. అది చాలా చిన్న విషయం ఒప్పుకుని చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరబాద్ ను ప్రపంచానికి ఫిల్మ్ హబ్ గా చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఫిల్మ్ సిటీ ప్రతిపాదన కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా. అన్నారు.

Ugadi Celebrations At FNCC
Ugadi Celebrations At FNCC

బ్రహ్మశ్రీ సురేష్ శర్మ గారి ఉగాది పంచాంగ శ్రవణం అద్భుతంగా సాగింది
అలాగే బెంగళూరు నాయర్ సిస్టర్స్ చేసిన విష్ణువైభవం భరత నృత్యం తో పాటుగా ప్రధానమంత్రి బాల్ పురస్కార్ గ్రహీత పెండ్యాల లక్ష్మీప్రియ బృందం చేసిన విశ్వనాధామృతం కూచిపూడి నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. నిహారిక వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here