ఏప్రిల్ 18న మోహనకృష్ణ ఇంద్రగంటి – శ్రీదేవి మూవీస్ – ప్రియదర్శి కాంబినేషన్‌లోని ‘సారంగపాణి జాతకం’ విడుదల

0
259
Sridevi Movies 'Sarangapani Jathakam' aims a Grand Release in theatres on April 18th
Sridevi Movies 'Sarangapani Jathakam' aims a Grand Release in theatres on April 18th

ఏప్రిల్ 18న మోహనకృష్ణ ఇంద్రగంటి – శ్రీదేవి మూవీస్ – ప్రియదర్శి కాంబినేషన్‌లోని ‘సారంగపాణి జాతకం’ విడుదల

శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటిలది సూపర్ హిట్ కాంబినేషన్. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత వాళ్లిద్దరి కలయికలో రూపొందుతున్న మూడో చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇందులో ప్రియదర్శి హీరోగా నటించారు. వేసవిలో థియేటర్లలో వినోదాలు పంచేందుకు ఈ సినిమా సిద్ధమైంది. ఏప్రిల్ 18న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

‘సారంగపాణి జాతకం’లో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ ‘సారంగో సారంగా’, ‘సంచారి సంచారీ’ పాటలు ట్రెండ్ అవుతుండగా, టీజర్‌లోని మాటలు, హాస్య సన్నివేశాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

‘సారంగపాణి జాతకం’ గురించి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ… ”ఫస్ట్ కాపీతో సహా ‘సారంగపాణి జాతకం’ సినిమా రెడీ అయ్యింది. త్వరలో సెన్సార్ పూర్తి చేస్తాం. ఏప్రిల్ 18న థియేటర్లలోకి సినిమాను తీసుకొస్తున్నాం. వేసవిలో హాయిగా కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసే చిత్రమిది. మా దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి అద్భుతంగా తీశారు. ఇటీవల విడుదలైన టీజర్ లో ప్రేక్షకులకు మా సారంగపాణి ప్రపంచం ఎలా ఉంటుందో పరిచయం చేశాం. ఇంటిల్లిపాదినీ కడుపుబ్బా నవ్వించే వినోదాత్మక చిత్రమిది” అని అన్నారు.

ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, ‘ఐమ్యాక్స్’ వెంకట్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మేకప్ చీఫ్: ఆర్.కె వ్యామజాల, కాస్ట్యూమ్ చీఫ్: ఎన్. మనోజ్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్ కామర్సు – అశ్విన్, మార్కెటింగ్: టాక్ స్కూప్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె. రామాంజనేయులు (అంజి బాబు) – పి రషీద్ అహ్మద్ ఖాన్, కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, స్టంట్స్: వెంకట్ – వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణా రెడ్డి, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన – దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here