నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి  అర్జున్ S/O వైజయంతి ప్రీ-టీజర్ మార్చి 14న రిలీజ్

0
18
Arjun SO Vyjayanthi Pre Teaser Announcement
Arjun SO Vyjayanthi Pre Teaser Announcement
నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, ప్రదీప్ చిలుకూరి, అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్  అర్జున్ S/O వైజయంతి ప్రీ-టీజర్ మార్చి 14న రిలీజ్

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.  

ఫస్ట్ లుక్ పోస్టర్‌తో గ్రేట్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిన ఈ మూవీ ప్రీ-టీజర్‌ను  మార్చి14న విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ మోడరన్ అవతార్‌లో కనిపించారు.  ఫ్రెంచ్ గడ్డం, షేడ్స్‌తో, భారీ మైనింగ్ ల్యాండ్‌స్కేప్ లో డైనమిక్ గా వాక్ చేస్తూ రావడం అదిరిపోయింది. ఈ ప్రీ-టీజర్ లో అఫీషియల్ టీజర్ విడుదల తేదీని కూడా రివిల్ చేస్తోంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ అద్భుతమైన విజువల్స్ అందించగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. ఎడిటింగ్ తమ్మిరాజు, స్క్రీన్‌ప్లే శ్రీకాంత్ విస్సా అందించారు.

సినిమా ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. మిగిలిన పార్ట్‌లు పూర్తయ్యాక, రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు.

నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీవీరాజ్  

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
డీవోపీ: రామ్ ప్రసాద్
బ్యానర్లు: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
ఎడిటర్: తమ్మిరాజు
సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి
స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
యాక్షన్: రామకృష్ణ, పీటర్ హెయిన్
పీఆర్వో: వంశీ-శేఖర్, వంశీ కాకా
మార్కెటింగ్: ఫస్ట్ షో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here