మా ల్యాంప్ సినిమా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మార్చి 14 తారీఖున థియేటర్స్ లలో విడుదల చేస్తున్నాం – హీరో నిర్మాత వినోద్ నువ్వుల

0
371
Vinod Nuvvula Starrer Lamp
Vinod Nuvvula Starrer Lamp

1. ‘ల్యాంప్’ సినిమా కథా నేపథ్యం గురించి చెప్పండి ??

మా లాంప్ సినిమా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.వరుస హత్యలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని ఛేదించే క్రమంలో హీరో ఎలా ట్రావెల్ అయ్యాడు కామెడీగా దీన్ని చూపిస్తూ ఫైనల్ గా అసలు ఏం జరిగింది? ఎలా వాటిని ఆపాడు అనేది స్టోరీ

2. ఈ చిత్రంలో మీ పాత్ర గురించి వివరించండి.

ఈ చిత్రంలో నేను ఒక కానిస్టేబుల్ గా ఉండి ఆ కేసులను పట్టుకొని ఫైనల్ గా ఇన్స్పెక్టర్ అవడం నా పాత్ర.సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే కామెడీ పండించడం నా పాత్ర హైలెట్

3. మీ టీం గురించి చెప్పండి

మా సినిమా ప్రొడ్యూసర్స్ ఏడు చేపల కథ అనే సినిమాకి ప్రొడ్యూస్ చేసిన వల్లే శేఖర్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు డైరెక్టర్ రాజశేఖర్ గారు మన సినిమాలో రాకేష్ మాస్టర్ నటించిన చివరి చిత్రం ఇది.
ఇందులో నాతో పాటు హీరోయిన్ మధుప్రియ కోటి కిరణ్ అవంతిక వెంకీ నాగేంద్ర చలపతి సౌమ్య నాగరాజు నటించారు.

4. వినోద్ ఫిల్మ్ అకాడమీ స్థాపనకు ప్రేరణ ఏమిటి?

ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ సినిమాల్లో నటించాలని వచ్చి మోసపోతున్నారు .ఏమీ నేర్చుకోకుండా వచ్చి ఇబ్బందులు పడే కంటే మా దగ్గర నేర్చుకుని వాళ్ళు మా గైడెన్స్ లో వెళ్లడం ద్వారా వాళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది రిస్కు కూడా తగ్గుతుంది.

4. అకాడమీ ద్వారా మీరు ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి?

మా అకాడమీలో యాక్టింగ్ నేర్చుకున్న విద్యార్థులకు మేమే అవకాశాలు చూపించి వాళ్ళు కట్టిన ఫీజు మళ్ళీ రెమ్యూనరేషన్ రూపంలో వాళ్ళు సంపాదించుకునే అంత గ్యారెంటీ మేము ఇస్తూ ఉంటాం .కొంతమంది స్టూడెంట్స్ మేము ఫీజు కడితే చాలు నేర్చుకోకుండానే మాకు ఇప్పిస్తారా అని చెప్పి అడుగుతా ఉంటారు .అలా కుదరదు అని చెప్తా ఉంటాo. ఎందుకంటే నేర్చుకోకుండా ఎలా చూపించగలుగుతాం సరిగ్గా నేర్చుకునే వాళ్ళకి డెఫినెట్గా మేము అవకాశాలు చూపిస్తూ ఉంటాం.

Vinod Nuvvula Starrer Lamp
Vinod Nuvvula Starrer Lamp

5. తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో మీ పాత్ర ఏమిటి?

ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటు ఉంటారు .ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొత్త రకంగా నటించే నేను , కొత్తగా నటించాలనుకునే యువతీ యువకుల్ని ప్రోత్సహిస్తూ ఉంటాను . కొత్తగా సినిమా తీయాలనుకునే యువ దర్శకులు ,ప్రొడ్యూసర్స్ కి సహకారం అందించడం కోసం మా అకాడమీ నుంచి స్టూడెంట్స్ ని కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఆర్టిస్టులుగా ఇస్తూ ఉంటాను.

6. భవిష్యత్తులో మీ ప్రాజెక్టులు ఏమిటి?

ప్రస్తుతం నేను బార్బరీక్ అనే సినిమా రిలీజ్ రెడీగా ఉంది . అలాగే శాసనమా చట్టమా అనే సినిమాలో హీరో సుమన్ గారి కొడుకు క్యారెక్టర్ చేస్తున్నాను మెయిన్ లీడ్ అలాగే డైరెక్టర్ హర్ష గారు డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ గారి కాంబినేషన్లో రెండు సినిమాల్లో లీడ్ గా నటిస్తూ ఉన్నాను .

7. మీరు నటుడిగా లేదా నిర్మాతగా మరిన్ని ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నారా?

నటుడుగా సినిమాలు వెబ్ సిరీస్ లు రంగస్థలంలో విభిన్నమైన పాత్రలు చేయడానికి నేనెప్పుడూ రెడీ గానే ఉంటాను చేస్తున్నను కూడా అలాగే నిర్మాతగా షార్ట్ ఫిలింలు వెబ్ సిరీస్ లు మా వినోద్ ఫిలిం అకాడమీ తరుపున చాలా చేశాం త్వరలో ఒక సినిమా కూడా మొదలుపెట్టబోతున్నాం.

8. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌లపై మీ అభిప్రాయాలు ఏమిటి?

ప్రస్తుతం ప్రేక్షకులు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది తేడా లేకుండా ఏ సినిమా నచ్చితే ఆ సినిమా చూస్తున్నారు కాబట్టి చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్ అవుతున్నాయి మా ల్యాంప్ సినిమా కూడా అదే రకంగా హిట్ అవుతుందని మేము ఆశిస్తున్నాం మంచి కంటెంట్ తో వస్తున్న సినిమా.

Vinod Nuvvula Starrer Lamp
Vinod Nuvvula Starrer Lamp

9. మీ అభిమాన నటులు లేదా దర్శకులు ఎవరు?

నాకు ఇష్టమైన డైరెక్టర్లు చాలామంది ఉన్నారు ప్రస్తుతం వస్తున్న యువ డైరెక్టర్లు అందరూ కూడా నాకు ఇష్టమే. మెయిన్ గా రాజమౌళి గారు,
నా అభిమాన నటులు బాలకృష్ణ చిరంజీవి ఎన్టీఆర్.

10. ఈ సినిమా విడుదల గురించి మీ టీం పెడుతున్న ఎఫర్ట్స్ చెప్పండి.

సినిమా గ్రాఫిక్స్ వర్క్ లు అవి ఉండటంవల్ల కొంచెం లేట్ అయింది కానీ థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని ఉద్దేశంతో మేము చాలా చక్కగా సినిమా ని తయారు చేశాం అయితే అద్భుతంగా మాకు ఇప్పుడు 150 థియేటర్లో సినిమా రిలీజ్ అయిపోతుంది. మా ట్రైలర్ సినిమా నచ్చి డిస్ట్రిబ్యూటర్లే మాకు ఎదురు డబ్బులు ఇచ్చి మరి సినిమా అని రిలీజ్ చేస్తా అన్నారు ఇది మాకు చాలా సంతోషకరమైన విషయం మార్చి 14 తారీఖున మా ల్యాంప్ సినిమా అన్ని థియేటర్స్ లలో విడుదల చేస్తున్నాం.

11. మీరు ప్రేక్షకులకు ఇవ్వాలనుకుంటున్న సందేశం ఏమిటి?

అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మా సినిమా టికెట్ రేట్ ని 110 రూపాయలుగా నిర్ణయించావు మాక్సిమం కాబట్టి అందరూ వచ్చి మా సినిమా చూడండి డెఫినెట్గా మీరు పెట్టిన 110 రూపాయలకి రెండు వందల పది రూపాయల ఎంటర్టైన్మెంట్ మేము అందిస్తామని గ్యారెంటీ ఇస్తున్నాం తప్పకుండా దీంట్లో కామెడీ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది మంచి సాంగ్స్ ఉన్నాయి ఫైట్స్ ఉన్నాయి. మీరు అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మా సినిమా

Vinod Nuvvula Starrer Lamp
Vinod Nuvvula Starrer Lamp

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here