నవీన్ చంద్ర ‘లెవెన్’ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ‘ఇక్కడ రా’ సాంగ్ రిలీజ్

0
165
నవీన్ చంద్ర ‘లెవెన్’ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ‘ఇక్కడ రా’ సాంగ్ రిలీజ్

నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో రూపొందిన రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్’. ఎఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శ్రుతిహాసన్‌ పాడిన ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Andrea From Ikkada Raa Song In Eleven
Andrea From Ikkada Raa Song In Eleven

తాజాగా మేకర్స్ ఈ మూవీనుంచి ఇక్కడ రా సాంగ్ రిలీజ్ చేశారు. డి. ఇమ్మాన్ ఈ సాంగ్ ని ఫుట్ ట్యాపింగ్ డ్యాన్స్ నెంబర్ గా  కంపోజ్ చేశారు. రాకేందు మౌళి రాసిన లిరిక్స్ క్యాచిగా వున్నాయి. ఈ పాటని ఆండ్రియా జెరెమియా పాడటంతో పాటు పెర్ఫార్మ్ చేయడం విశేషం. ఈ సాంగ్ లో ఆండ్రియా డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి.

సిల నెరంగళిల్ సిల మణిధర్గళ్’ చిత్రంలో నటించిన రేయా హరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘విరుమండి’ ఫేమ్ అభిరామి, ‘వత్తికూచి’ ఫేమ్ దిలీపన్, ‘మద్రాస్’ ఫేమ్ రిత్విక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Andrea From Ikkada Raa Song In Eleven
Andrea From Ikkada Raa Song In Eleven
ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తుండగా, బాలీవుడ్‌లో అనుభవం ఉన్న కార్తీక్ అశోక్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకాంత్ ఎన్.బి ఎడిటర్.

సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=4djwYVS5jdA&ab_channel=SaregamaTelugu

నటీనటులు: నవీన్ చంద్ర, రేయా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, రిత్విక, ఆడుకలం నరేన్, రవివర్మ, అర్జై, కిరీటి దామరాజు

సాంకేతిక విభాగం
రచన, దర్శకత్వం – లోకేశ్ అజ్ల్స్
బ్యానర్ – AR ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత – అజ్మల్ ఖాన్ & రేయా హరి
సంగీతం – డి.ఇమ్మాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ప్రభు సాలమన్
సహ నిర్మాత – గోపాలకృష్ణ.ఎం
డీవోపీ – కార్తీక్ అశోక్
ఎడిటర్ – శ్రీకాంత్.ఎన్.బి
ఆర్ట్ డైరెక్టర్ – పి.ఎల్. సుబెంథర్
యాక్షన్ డైరెక్టర్ – ఫీనిక్స్ ప్రభు
పీఆర్వో- వంశీ శేఖర్

Andrea From Ikkada Raa Song In Eleven
Andrea From Ikkada Raa Song In Eleven

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here