తల చిత్ర రివ్యూ
చిత్రం: తల
విడుదల తేదీ: 14-02-2025
నటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరోన్హ, ముక్కు అవినాశ్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్
దర్శకుడు: అమ్మ రాజశేఖర్
నిర్మాత : శ్రీనివాస గౌడ్
బ్యానర్: దీపా ఆర్ట్స్
రైటర్స్: అమ్మ రాజశేఖర్
డీఓపీ: శ్యామ్ కె నాయుడు
సాంగ్: థమన్ ఎస్‌ఎస్
మ్యూజిక్ డైరెక్టర్: ధర్మ తేజ, అస్లాం కేఈ
బీజీఎం: అస్లాం కేఈ
డైలాగ్స్: అమ్మ రాజశేఖర్ అండ్ టీం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాధ రాజశేఖర్
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ
డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్: అమ్మ రాజశేఖర్
లిరిసిస్ట్స్: ధర్మతేజ
ఎడిటర్ : శివ సామి
దీప ఆర్ట్స్ బ్యానర్ పై సుప్రసిద్ధ దర్శక కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తన కొడుకు అమ్మ రాగిన్ రాజ్ ను హీరోగా పరిచయం చేస్తూ అంకిత నస్కర్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం తల. రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, సత్యం రాజేష్, అజయ్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ తదితరులు కీలకపాత్రలో వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ చిత్రం విడుదలయింది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లో తెలుసుకుందాం.
కథ :
తన తల్లి ప్రేమించిన వ్యక్తికి దూరమై కాలం వెళ్లదీస్తూ ఉంటుంది. అలా అనారోగ్యం బారిన పడిన అమ్మ.. తన కుమారుడిని పిలిచి అతని తండ్రి గురించి చెబుతుంది. వాళ్లు ఎలా విడిపోయామన్నది చెబుతోంది. దీంతో తన తండ్రి కలవాడినికి హీరో (అమ్మ రాగిన్ రాజ్) బయలు దేరుతాడు. ఈ క్రమంలో అప్పటికే వేరే పెళ్లి చేసుకున్న అతని తండ్రి కుటుంబానికి తానెవరో చెప్పకుండా దగ్గరవుతాడు. అదే సందర్బంలో హీరోకు ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. అయితే అనుకోకుండా హీరో తండ్రి ఫ్యామిలీలో ఏదో సమస్య వచ్చి పడుతుంది. ? అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి సంఘటనలు జరుగుతాయి? తనకు పరిచయమైన అమ్మాయి చివరిగా హీరోకు ఏమవుతుంది? వారి కుటుంబంలోకి వచ్చిన సమస్య ఎటువంటిది? ఆ సమస్యను వారు ఎలా పరిష్కరిస్తారు? అసలు చివరికి తన తల్లిదండ్రులు కలుస్తారా? ఈ మజిలిలో వారి లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుందనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ‘తల’ మూవీ చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ తొలి చిత్రం కావడంతో ముందుగా అతని నటన గురించి మాట్లాడుకోవాలి. మొదటి చిత్రమైనప్పటికీ ఎక్కడ కూడా కొత్తగా వచ్చిన నటుడిలా అనిపించలేదు. ప్రతి సీన్, ప్రతి ఎమోషన్ ఎంతో స్పష్టంగా తనదైన శైలిలో తను నటిస్తూ మంచి నటుడు అని తొలి చిత్రంతోనే ప్రూవ్ చేసుకున్నాడు. రాగిన్ రాజ్ కు జోడిగా అంకిత అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఎంతోకాలం తర్వాత తెరపైకి వచ్చిన రోహిత్ తండ్రి పాత్రలో నటిస్తూ ఆ పాత్రకు ప్రాణం పోశారు. అదేవిధంగా ఎస్తేర్ నోరోన్హా… ఎప్పుడూ గ్లామర్ గా కనిపించే ఈమె ఈ చిత్రంలో తల్లి సెంటిమెంట్ తో పాటూ కామెడీని అలాగే ఎమోషన్ను పండించారు. ఈ చిత్రంలో నెగిటివ్ పాత్రల్లో నటించిన వారంతా కథ కు తగ్గట్లు నటిస్తూ చిత్రానికి తమవంతు సహకారం అందించారు. ముఖ్యంగా విజ్జి చంద్రశేఖర్ నెగిటివ్ పాత్రలో అద్భుతంగా నటించారు. అజయ్, సత్యం రాజేష్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ వంటి వారు ఈ చిత్రానికి మరొక ప్లస్ పాయింట్ గా నిలిచి తమ పాత్రల పరిధి మేరకు నటిస్తూ ఈ చిత్రం మరింత అధ్బుతంగా రావడానికి తోడ్పడ్డారు.
సాంకేతిక నిపుణుల పనితీరు :
ఈ చిత్రానికి కథ ప్రాణమని చెప్పుకోవాలి. అమ్మ అనే పేరును తన పేరు ముందు పెట్టుకున్న అమ్మ రాజశేఖర్.. అదే అమ్మ సెంటిమెంట్ ను ప్రేక్షకులను సీట్లలో కదలనీయకుండా చేసాడు. మంచి సెంటిమెంట్ తో కూడిన యాక్షన్ డ్రామాగా మలచడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా అమ్మాయి కోసం ప్రాణాలు ఇస్తున్న ఈ రోజుల్లో అమ్మ కోసం కష్టపడే కుమారుడి స్టోరీనే తనదైన యాక్షన్ కమ్ ఫ్యామిలీ డ్రామా మలచడంలో దర్శకుడిగా అమ్మ రాజశేఖర్ సక్సెస్ అయ్యారు. అంతేకాదు 24 క్రాఫ్ట్స్ ను ఎక్కడ ఏ మేరకు ఏ మోతాదులో ఎలా వాడుకోవాలో అమ్మ రాజశేఖర్ ‘తల’ సినిమా కోసం వాడిన విధానం చూస్తే మెచ్చుకోవాల్సిందే.
అలాగే చిత్రంలోని పాటలు, ఆ పాటలకు తగ్గ డాన్స్ స్టెప్స్ తో పాటలు హైలెట్ అయ్యేలా చేశారు. చిత్రం అంతట బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరొక బోనస్ గా నిలిచింది. చిత్రంలోని యాక్షన్ సీన్స్ అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. తర్వాత ఏం జరుగుతుందనే కుతూహలం ప్రేక్షకుల్లో కలిగేలా చేసాడు. శ్యాం కే నాయుడు ఫోటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా యాక్షన్, ఎమోషన్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద ఎస్సెట్ గా నిలిచింది. అక్కడక్కడ ఆర్ఆర్ తడబట్టు కనబడ్డా ఓవరాల్ గా బాగుంది. ఇంకాస్త బెటర్ గా ఇవ్వొచ్చని చెప్పొచ్చు. ఎడిటర్ శివసామి ప్రేక్షకులకు ఏది కావాలో అదే తెరపై చూపించాడు. అక్కడ కొన్ని సీన్స్ ఉన్నా.. దాదాపు ప్రేక్షకులు బోర్ కొట్టించకుండా ఎడిటింగ్ చేసాడు. గ్రాఫిక్స్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
మదర్ సెంటిమెంట్ తో వచ్చి అలరించిన చిత్రాలలో ఈ చిత్రం కూడా స్థానం సంపాదించుకుంది. కుటుంబం సమేతంగా వెళ్లి చూసే విధంగా మంచి ఎమోషన్తో ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
రేటింగ్: 3 / 5
చివరగా: ‘అమ్మ’ సెంటిమెంట్ తో ఆకట్టుకునే యాక్షన్ ఎంటర్టైనర్