రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్

0
68
Rakshasa Title Song Launched
Rakshasa Title Song Launched

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్.. ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానున్న రాక్షస

కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాక్షస. ఈ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒరిజినల్ వెర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ అదేరోజు విడుదలవుతోంది. . గతంలో శివరాజ్ కుమార్ నటించిన వేద చిత్రాన్ని విడుదల చేసిన ఎంవీఆర్ కృష్ణ రాక్షస తెలుగు రైట్స్ ను దక్కించుకున్నారు. కంచి కామాక్షి కోల్ కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. “కాంతారా”, “విరూపాక్ష” లాంటి థ్రిల్లర్స్ కు సూపర్ హిట్ సంగీతం అందించిన అజనీష్ లోక్ నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Prajwal Devaraj From Rakshasa Movie
Prajwal Devaraj From Rakshasa Movie

ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

తాజాగా గురువారం ఈ మూవీ టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సినిమా కాన్సెప్ట్ ను తెలియజేసేలా సాగిన ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటుంది. అజనీష్ లోక్ నాథ్ కంపోజ్ చేసిన ఈ పాటలో సౌండ్ ట్రాక్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తున్నాయి. “మాయలో మాయకి చిక్కినాక.. దారిలో కానరాక చొచ్చుకెళ్లాక.. రూపమే అదృశ్యం అయ్యాక.. నా నీడే వెచ్చగా తగిలాక.. వెళ్లే దారిలో..తిరిగే సుడిగుండంలా మొత్తం అంతా మాయే.. కలయో నిజమో అసలేమీ తెలియదే.. భయంతో గట్టిగా పిలిచే నువ్వెవరే..రా రా రాక్షస” అంటూ సాగిన పాటకు ప్రేమ్ బి ఎస్ అర్థవంతమైన లిరిక్స్ ను అందించగా, సాయి చరణ్ వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Prajwal Devaraj From Rakshasa Movie
Prajwal Devaraj From Rakshasa Movie

ఈ సందర్భంగా నిర్మాత ఎంవిఆర్ కృష్ణ మాట్లాడుతూ..” ప్రజ్వల్ దేవరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు, ట్రైలర్ కు మంచి ఆదరణ దక్కింది. ఈరోజు విడుదల చేసిన పాట కూడా ప్రతి ఒక్కరూ బాగుందని చెబుతాన్నారు. ముఖ్యంగా “కాంతారా” ఫేం అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది. ఈ పాట తరహాలోనే సినిమా కూడా అందరూ ఇష్టపడేలా ఉంటుంది.మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. బాగా ఈ చిత్రానికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుందని నమ్మకం ఉంది” అని చెప్పారు.

Prajwal Devaraj From Rakshasa Movie
Prajwal Devaraj From Rakshasa Movie

ఈ చిత్రంలో అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్, విహాన్ కృష్ణ తదితరులు నటిస్తున్నారు.

చిత్రం : రాక్షస
విడుదల తేదీ : ఫిబ్రవరి 28.
నటీనటులు : డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్, అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్, విహాన్ కృష్ణ, జయంత్ తదితరులు..

సమర్పణ : మందపాటి సంస్కృతి , అక్షర
బ్యానర్ : కంచి కామాక్షి కోల్ కతా కాళి క్రియేషన్స్
నిర్మాత : ఎం వి ఆర్ కృష్ణ
సినిమాటోగ్రఫీ : జైబిన్ పి జాకబ్
సంగీత దర్శకుడు : బి. ఆజనీష్ లోక్ నాథ్
దర్శకుడు : లోహిత్ హెచ్
పీఆర్వో: హర్ష

Prajwal Devaraj From Rakshasa Movie
Prajwal Devaraj From Rakshasa Movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here