‘మదగజరాజా’ ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్ టైనర్. తమిళ్ లో పెద్ద హిట్ అయ్యింది. తెలుగు లో కూడా చాలా ఎంజాయ్ చేస్తారు: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ అంజలి

0
137

‘మదగజరాజా’ ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్ టైనర్. తమిళ్ లో పెద్ద హిట్ అయ్యింది. తెలుగు లో కూడా చాలా ఎంజాయ్ చేస్తారు: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ అంజలి

విశాల్ సెన్సేషనల్ హిట్ ‘మదగజరాజా’ సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి హీరోయిన్స్ గా సుందర్ సి దర్శకత్వంలో జెమిని ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించిన ఈ సినిమా 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, పండుగ సీజన్‌లో తమిళంలో నంబర్ వన్ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ యాక్షన్-కామెడీ ఎంటర్ టైనర్ సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా జనవరి 31న తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.

హీరోయిన్ అంజలి మాట్లాడుతూ.. ఇది మంచి కమర్షియల్ సినిమా. ఇందులో చేసిన క్యారెక్టర్ ని చాలా ఎంజాయ్ చేశాను.  విశాల్ డియర్ ఫ్రెండ్. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. తను చాలా ఫన్ పర్శన్. ఈ సినిమా తమిళ్ లో పెద్ద హిట్ అయ్యింది. తెలుగు ఆడియన్స్ కి కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను.  విశాల్ యాక్షన్, సంతానం కామెడీ, మ్యూజిక్, సుందర్ సర్ డైరెక్షన్ తో కలర్ ఫుల్ మూవీ ఇది. మూవీ లవర్స్ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. థియేటర్స్ లో చూడండి. తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు. 

Anjali, Varalaxmi Sarathkumar At Vishal's Madha Gaja Raja Telugu Pre Release Event
Anjali, Varalaxmi Sarathkumar At Vishal’s Madha Gaja Raja Telugu Pre Release Event

హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఇది హీరోయిన్ గా నా ఫస్ట్ కమర్షియల్ సినిమా. అంజలి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. తను అద్భుతమైన యాక్టర్. ఇందులో వెస్ట్రన్ హీరోయిన్ గా కనిపించాను. ఈ సినిమా తమిళ్ లో చాలా పెద్ద హిట్. మంచి ఎంటర్ టైనర్. ప్రతి ఎపిసోడ్ ని ఎంజాయ్ చేస్తారు. ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్ టైనర్. జనవరి 31న తెలుగు రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి’ అన్నారు.

నిర్మాత జెమిని కిరణ్ మాట్లాడుతూ.. ఒక హీరో ఇద్దరు హీరోయిన్స్ తో వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం అని ఈ సంక్రాంతికి ఇక్కడ పెద్ద హిట్ కొట్టారు. అలాగే అక్కడ విశాల్ గారు మదగజరాజా తో తమిళ్ లో పెద్ద విజయం అందుకున్నారు. అక్కడ వి ఇక్కడ వి. ఖచ్చితంగా ఇక్కడ కూడా సూపర్ హిట్ కొడతారు. ఈ సినిమా తమిళ్లో సూపర్ డూపర్ హిట్టు. ఇక్కడ కూడా అలానే అవుతుందని ఆశిస్తున్నాను. థాంక్యూ ఆల్ ది బెస్ట్’ అన్నారు.  

Anjali, Varalaxmi Sarathkumar At Vishal's Madha Gaja Raja Telugu Pre Release Event
Anjali, Varalaxmi Sarathkumar At Vishal’s Madha Gaja Raja Telugu Pre Release Event

తారాగణం: విశాల్, సంతానం, వరలక్ష్మి, అంజలి, శరత్ సక్సేనా, సోనూ సూద్, మణివణ్ణన్ (లేట్), నితిన్ సత్య, సడగొప్పన్ రమేష్, ఆర్. సుందర్ రాజన్, మొట్టా రాజేంద్రన్, మనోబాలా (లేట్), స్వామినాథన్, జాన్ కొక్కెన్, టార్జాన్, విచ్చు విశ్వనాథ్,  S మనోహర్, కె. జయలక్ష్మి, అజయ్ రత్నం, సుబ్బరాజు, ముత్తుకలై, అళగు మాస్టర్

సాంకేతిక సిబ్బంది:
నిర్మాణం: జెమినీ ఫిల్మ్ సర్క్యూట్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుందర్ సి
తెలుగు విడుదల: సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం. నాథన్
సంగీతం: విజయ్ ఆంటోని
సాహిత్యం: శశాంక్ వెన్నెలకంటి
ఎడిటర్: శ్రీకాంత్ ఎన్.బి.
ఆర్ట్ డైరెక్టర్: గురురాజ్
స్టంట్స్: సూపర్ సుబ్బురాయన్
కొరియోగ్రఫీ: బృందా, శోబి
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఆర్.పి.బాలగోపి
పీఆర్వో : వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here