సంక్రాంతికి వస్తున్నాం.. వచ్చాం.. కొట్టాం. ఈ విజయం ప్రేక్షకులదే: బ్లాక్ బస్టర్ సంబరం ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్

0
236
Sankranthiki Vasthunnam Sankranthi Sambaram Event
Sankranthiki Vasthunnam Sankranthi Sambaram Event
సంక్రాంతికి వస్తున్నాం.. వచ్చాం.. కొట్టాం. ఈ విజయం ప్రేక్షకులదే: బ్లాక్ బస్టర్ సంబరం ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ భీమవరంలో బ్లాక్ బస్టర్ సంబరం ఈవెంట్  నిర్వహించింది.  భారీగా హాజరైన అభిమానులు ప్రేక్షకులు సమక్షంలో ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మల్యే కామినేని శ్రీనివాసరావు ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు.

బాక్సాఫీస్ సంబరం ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. హాయ్ భీమవరం అందరికీ నమస్కారం. సంక్రాంతికి వస్తున్నాం..వచ్చాం, కొట్టాం. ఇదంతా మీదే. భీమవరం ప్రేక్షకులు ఎప్పుడూ నా గుండెల్లో వుంటారు. ఇది మంచి హిట్ సినిమా చేస్తున్నాం అనుకున్నాం. కానీ దిన్ని మీరు ట్రిపుల్ బ్లాక్ బస్టర్ చేసినందుకు థాంక్ యూ. వంద, రెండు వందలు, మూడు వందలు కోట్లు అంటున్నారు. ఇది మీరు ఇచ్చారు.  ఈ సినిమా క్రెడిట్ అనిల్ అండ్ టీంకి దక్కుతుంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ కి థాంక్ యూ. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మళ్ళీ రాదు.  ఐశ్వర్య మీనాక్షి కి మరిన్ని హిట్లు రావాలని కోరుకుంటున్నారు. అందరి హీరో అభిమానులకు థాంక్ యూ. మీ ప్రేమ ఇలానే వుంటే మళ్ళీ సంక్రాంతి వస్తాం. మరో బ్లాక్ బస్టర్ ఇస్తాం. నిర్మాతలు దిల్ రాజు అండ్ శిరీష్ కి థాంక్స్. అందరికీ పేరుపేరునా థాంక్ యూ’ అన్నారు.

Sankranthiki Vasthunnam Sankranthi Sambaram Event
Sankranthiki Vasthunnam Sankranthi Sambaram Event

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. హలో భీమవరం. అందరికీ బిగ్ థాంక్స్. బీమ్స్ గోదారి గట్టు పాట ఈ సినిమా సందడి మొదలైయింది. ఈ సినిమా పెద్ద హిట్ అయితే చాలు అనుకున్నాం. కానీ సినిమాని మీరు ఎక్కడితో తీసుకెళ్ళి పెట్టారు. ఇంత పెద్ద విజయాన్ని ఆడియన్స్ కి  బిగ్ థాంక్ యూ. ఎస్విసి బ్యానర్ నా ఫ్యామిలీ. ఇది వారితో ఆరో సినిమా. దిల్ రాజు గారికి శిరీష్ గారికి థాంక్ యూ. టీం అందరికీ థాంక్ యూ. మా విక్టరీ వెంకటేష్ గారికి చాలా థాంక్. ఈ సినిమా క్రెడిట్ ఆయనే దక్కుతుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. నేను వెంకటేష్ గారి అభిమానిని. ఆయన సినిమాకు చూసి విజల్స్ వేశాను. ఆయనలా జుట్టుపెచుకున్నాను. ఆయన సినిమాకి డైరెక్టర్ చేయడం గ్రేట్ హానర్. థాంక్ యూ సార్. పద్మభూషణ్ అవార్డ్ అందుకొనున్న బాలయ్య గారికి మా సినిమా తరపున బిగ్ కంగ్రాట్స్. ఈ సంక్రాంతిని మర్చిపోలేను. మీ ఆశీస్సులతో కుదిరితే ఇంకో సంక్రాంతి వస్తా’ అన్నారు

నిర్మాత శిరీష్ మాట్లాడుతూ.. అందరికీ థాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షుకులకు థాంక్ యూ వెరీ మచ్’ అన్నారు.

Sankranthiki Vasthunnam Sankranthi Sambaram Event
Sankranthiki Vasthunnam Sankranthi Sambaram Event

హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. అందరికీ థాంక్ యూ. సంక్రాంతి ఇంత పెద్ద గిఫ్ట్  ఊహించలేదు. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కి థాంక్ యూ’ అన్నారు.

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ భీమవరంలో చేసుకోవడం ఆనందంగా వుంది. వెంకటేష్ గారి మిస్ అయ్యాను. ముఖ్యంగా ఫుడ్(నవ్వుతూ). దిల్ రాజు గారికి శిరీష్ గారికి థాంక్ యూ. అనిల్ గారికి బిగ్ థాంక్స్. ఈ విజయాన్ని మర్చిపోలేను’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద సక్సెస్ ఫుల్ సినిమాలో నన్ను పార్ట్ చేసిన అనిల్ గారికి వెంకటేష్ గారికి దిల్ రాజు గారికి శిరీష్ గారికి థాంక్ యూ. ఈ సినిమాలో పాటలు రాసిన రచయితలకు థాంక్. ఇందులో పాటలు పాడిన సింగర్స్ కి ముఖ్యంగా వెంకటేష్ గారికి థాంక్ యూ. ఈ సినిమాని ఇంత పెద్ద విజయాన్ని చేసిన అందరికీ థాంక్’ అన్నారు. మూవీ టీం అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Sankranthiki Vasthunnam Sankranthi Sambaram Event
Sankranthiki Vasthunnam Sankranthi Sambaram Event

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here