“రాజా సాబ్” సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ న్యూ పోస్టర్ రిలీజ్

0
44
Prabhas New Look In Raja Saab
Prabhas New Look In Raja Saab

మకర సంక్రాంతి శుభాకాంక్షలతో “రాజా సాబ్” సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ న్యూ పోస్టర్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ “రాజా సాబ్”. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో “రాజా సాబ్” సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా “రాజా సాబ్” సినిమా నుంచి శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పండుగ కళ కనిపిస్తున్న ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది.

సూపర్ హిట్ సినిమాలు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ “రాజా సాబ్” సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేస్తోంది. “రాజా సాబ్” సినిమాను అందరికీ గుర్తుండిపోయేలా రూపొందిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమా త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం “రాజా సాబ్” చిత్రీకరణ తుది దశలో ఉంది.

నటీనటులు – ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ – కార్తీక్ పళని
మ్యూజిక్ – తమన్
ఫైట్ మాస్టర్ – రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కేఎన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – టీజీ కృతి ప్రసాద్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్- శ్రీనివాస్), వంశీ కాకా
కో ప్రొడ్యూసర్ – వివేక్ కూచిభొట్ల
ప్రొడ్యూసర్ – టీజీ విశ్వప్రసాద్
రచన, దర్శకత్వం – మారుతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here