ఘనంగా జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సభ్యుల బాధ్యతల స్వీకరణ

0
129

ఘనంగా జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సభ్యుల బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్
ది జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి నూతన పాలక వర్గం బాధ్యతలు స్వీకరించారు. జూబిలీ హిల్స్ లోని సొసైటీ కార్యాలయంలో బుధవారం ఘనంగా జరిగిన బాధ్యతల స్వీకరణ మహోత్సవంలో సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గా మసాడే లక్ష్మి నారాయణ, జాయింట్ సెక్రటరీ గా భాగ్యలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఎంతోకాలంగా ఫిలిం జర్నలిస్టులుగా పని చేస్తున్న లక్ష్మి నారాయణ, భాగ్యలక్ష్మి ఇద్దరూ పాలక మండలి లో కీలక బాధ్యతలు తీసుకోవడం సినిమా జర్నలిస్టులకు గర్వకారణంగా చెప్పవచ్చు. జర్నలిస్టులకు సొంత ఇంటి సాధన లక్ష్యంగా ఈ నూతన కమిటీ పని చేస్తుందని బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరిగిన సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జాయింట్ సెక్రటరీ భాగ్యలక్ష్మి తెలిపారు. సినిమా జర్నలిస్టుల తో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here