హీరో కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్

0
151
Kiran Abbavaram Dil Ruba First Look KA10
Kiran Abbavaram Dil Ruba First Look KA10

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు, ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న టైటిల్ పోస్టర్

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. “దిల్ రూబా” చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి,సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.

“దిల్ రూబా” సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్ లో కిరణ్ అబ్బవరం యూనిక్ స్టైల్, యాటిట్యూడ్ తో కనిపిస్తున్నారు. ‘హిస్ లవ్, హిస్ యాంగర్..’ అనే కొటేషన్ కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ ను రిఫ్లెక్ట్ చేస్తోంది. లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా “దిల్ రూబా” సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తుండగా, డానియేల్ విశ్వాస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. “క” సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం చేస్తున్న చిత్రంగా “దిల్ రూబా”పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ను ఫిబ్రవరి లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, తదితరులు

టెక్నికల్ టీమ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్) & దుడ్డి శ్రీను.
ఎడిటర్ – ప్రవీణ్.కేఎల్
సినిమాటోగ్రఫీ – డానియేల్ విశ్వాస్
మ్యూజిక్ – సామ్ సీఎస్
నిర్మాతలు – రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి,సారెగమ.
రచన, దర్శకత్వం – విశ్వ కరుణ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here