ఈ సినిమాలో కృష్ణుడే సూపర్ స్టార్, కంటెంటే సూపర్ స్టార్ : ‘డియర్ కృష్ణ’ ప్రెస్ మీట్ లో నిర్మాత పి.ఎన్. బలరామ్

0
151

ఈ సినిమాలో కృష్ణుడే సూపర్ స్టార్, కంటెంటే సూపర్ స్టార్ : ‘డియర్ కృష్ణ’ ప్రెస్ మీట్ లో నిర్మాత పి.ఎన్. బలరామ్

పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్ పై రూపొందుతోన్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘డియర్ కృష్ణ’. ఈ సినిమా ద్వారా పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా పరిచయమవుతున్నారు. దినేష్ బాబు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ ని ప్రేరణగా తీసుకొని, వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్న ‘డియర్ కృష్ణ’ చిత్రంలో యువ సంచలనం, ‘ప్రేమలు’ చిత్రం ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఐశ్వర్య కూడా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రచార చిత్రాలతో, లక్ష రూపాయల కాంటెస్ట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘డియర్ కృష్ణ’పై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ ప్రెస్ మీట్ లో శ్రీ కృష్ణుడిని ముఖ్య అతిథిగా భావిస్తూ, ఆయన కోసం ప్రత్యేకంగా ఒక కుర్చీని ఏర్పాటు చేయడం విశేషం.

Dear Krishna Movie Press Meet
Dear Krishna Movie Press Meet

రచయిత, నిర్మాత పి.ఎన్. బలరామ్ మాట్లాడుతూ, “నేను ఈ సినిమాకి నిర్మాతగా భావించట్లేదు. కృష్ణుడి సందేశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న వ్యక్తిగానే భావిస్తున్నాను. మా కుటుంబం శ్రీ కృష్ణుడిని ఎంతగానో ఆరాధిస్తాము. ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి. కృష్ణుడి వల్ల మా కుటుంబంలో జరిగిన మిరాకిల్ నే కథగా తీసుకొని, డియర్ కృష్ణ సినిమాని రూపొందించడం జరిగింది. అదేంటంటే మా కుమారుడు అక్షయ్ అత్యంత రేర్ డిసీజ్ నుంచి, డాక్టర్లే ఆశ్చర్యపోయేలా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సినిమాలో అక్షయ్ నే హీరోగా నటించాడు. ఈ చిత్రం కోసం మేము స్టార్స్ ని తీసుకోవాలి అనుకోలేదు. ఎందుకంటే కృష్ణుడే సూపర్ స్టార్, కంటెంటే సూపర్ స్టార్. మమ్మల్ని, మా సినిమాని కృష్ణుడే నడిపిస్తాడు.” అన్నారు.

Dear Krishna Movie Press Meet
Dear Krishna Movie Press Meet

కథానాయకుడు అక్షయ్ మాట్లాడుతూ, “నా జీవితంలో జరిగిన మిరాకిల్ ప్రేరణగా తీసుకొని రూపొందుతోన్న ఈ చిత్రంలో నేను నటించడం సంతోషంగా ఉంది. మా కుటుంబానికి, కృష్ణుడికి మధ్య నడిచే ప్రేమ కథే ఈ చిత్రం. మా నాన్న నాకు జన్మని ఇవ్వడమే కాదు, పునర్జన్మను కూడా ఇచ్చారు. ఆయన వల్లే నేను ఈరోజు ఇలా మీ ముందు ఉన్నాను. విజయ్ గారి 69 వ సినిమా షూటింగ్ లో ఉండటం వల్ల మమిత ఈ ప్రెస్ మీట్ కి రాలేకపోయింది. త్వరలో జరిగే ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఆమె పాల్గొంటుంది.” అన్నారు.

Dear Krishna Movie Press Meet
Dear Krishna Movie Press Meet

కథానాయిక ఐశ్వర్య మాట్లాడుతూ, “నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు దినేష్ బాబు గారికి, నిర్మాత బలరామ్ గారికి కృతజ్ఞతలు. అక్షయ్, మమిత, లోహిత్ గారు లాంటి ఎందరో ప్రతిభగల నటీనటులు ఉన్న ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది.” అన్నారు.

సీనియర్ నటుడు లోహిత్ మాట్లాడుతూ, “ఇది అద్భుతమైన ప్రేమ కథ. అయితే అన్ని ప్రేమ కథల లాంటిది కాదిది. ఒక కుటుంబం కృష్ణుడిని ప్రేమిస్తే వచ్చిన కథ. ఇలాంటి వాస్తవ కథను సినిమాగా తీసుకొస్తున్న బలరామ్ గారికి ధన్యవాదాలు.” అన్నారు.

చీఫ్ అసోసియేట్, అడిషనల్ డైలాగ్ రైటర్ నాగ నందేశ్వర్ గిడుతురి(నందు) మాట్లాడుతూ, “నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా చేసుకొని పీఎన్ బలరామ్ గారు అద్భుతమైన కథ అందించారు. ఆ కథను అంతే అద్భుతంగా దర్శకుడు దినేష్ గారు తెర మీదకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుంది.” అన్నారు.

గీత రచయిత గిరిపట్ల మాట్లాడుతూ, ” ఈ సినిమాలో మూడు అద్భుతమైన పాటలు రాసే లభించింది. ఆ మూడు పాటల్లో ఒక పాటను లెజెండరీ సింగర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు పాడటం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు.” అన్నారు.

హరి ప్రసాద్ సంగీతం అందిస్తున్న డియర్ కృష్ణ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా దినేష్ బాబు, ఎడిటర్ గా రాజీవ్ రామచంద్రన్ వ్యవహరిస్తున్నారు. లెజెండరీ సింగర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట ఈ సినిమా లోనిదే కావడం విశేషం. ‘చిరుప్రాయం’ అంటూ సాగే ఈ పాట ఇప్పటికే విడుదలై విశేషంగా ఆకట్టుకుంది.

చిత్రం: డియర్ కృష్ణ
నటీనటులు: అక్షయ్, మమిత బైజు, ఐశ్వర్య
రచయిత, నిర్మాత: పి.ఎన్. బలరామ్
డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: దినేష్ బాబు
సినిమాటోగ్రఫీ: దినేష్ బాబు
ఎడిటర్: రాజీవ్ రామచంద్రన్
సంగీతం: హరి ప్రసాద్
లిరిక్స్: గిరిపట్ల
చీఫ్ అసోసియేట్ & అడిషనల్ డైలాగ్స్: నాగ నందేశ్వర్ గిడుతురి(నందు)
పీఆర్ఓ: హరీష్, దినేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here