“ఓ తండ్రి తీర్పు ” చిత్ర సమర్పకులు లయన్ డాక్టర్ ఆరిగపూడి విజయ్ కుమార్ అకాల మరణం

0
218
Lion Dr Arikapudi Vijay Kumar
Lion Dr Arikapudi Vijay Kumar

“ఓ తండ్రి తీర్పు ” చిత్ర సమర్పకులు లయన్ డాక్టర్ ఆరిగపూడి విజయ్ కుమార్ అకాల మరణం

ప్రముఖ సంఘ సేవకులు,
ఏవీకే ఫిలిమ్స్ అధినేత ,
లయన్ డాక్టర్ ఆరిగపూడి విజయకుమార్ గారు నిన్న రాత్రి (మంగళవారం ) గుండెపోటుతో అకాల మరణం చెందారు.గత కొద్ది కాలంగా ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతోబాధపడుతున్నారు.అంత బాధలోనూ ఆయన సేవా కార్యక్రమాలు ఏవి ఆపలేదు.
సహాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి లేదనకుండా సాయం చేశారు.

ఇటీవలనే వారి శ్రీమతి లయన్ కృష్ణకుమారి మరణించారు. ఆమె లేని లోటును ఆయన భరించలేకపోయారు. దానితో పాటు వారికి అనారోగ్య సమస్యలు తోడయ్యాయి.

Lion Dr Arikapudi Vijay Kumar
Lion Dr Arikapudi Vijay Kumar

లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాతగా విజయ్ కుమార్ సమర్పణలో ఓ తండ్రి తీర్పు సినిమా ఫస్ట్ కాపి సిద్ధమైంది.

ఓ తండ్రి తీర్పు సినిమా నేను ఈ సమాజానికి అందిస్తున్న కానుక అని వారు పదే పదే చెబుతూ ఉండేవారు. ఈ సినిమాలో ఆయన ఒక ప్రధానమైన పాత్ర కూడా చేశారు.ఇదే వారి ఆఖరి చిత్రం.

ఆయన ఇక లేరు అన్న విషయం తెలుసుకున్న అభిమానులు బోరున విలపిస్తున్నారు.

“మంచివాళ్ళకు మంచే జరుగుతుంది అంటారు కానీ విజయకుమార్ గారికి ఎందుకో మంచి జరగలేదు .” అని ప్రముఖ సినీ టీవీ రచయిత రాజేంద్ర రాజు కాంచనపల్లి కన్నీటి పర్యంతమయ్యారు.

Lion Dr Arikapudi Vijay Kumar
Lion Dr Arikapudi Vijay Kumar

” విజయ్ కుమార్ గారు ఇక లేరంటే నమ్మ బుద్ధి కావడం లేదు. అలాంటి మంచి మనిషిని ఇంతకు ముందు నేను చూడలేదు ఇకముందు చూడను కూడా. ఆయన నా ద్వారా ఏర్పాటు చేయించిన ఏ.పి.ఎన్ ఫౌండేషన్ ను ముందుకు తీసుకెళ్లడమే నా బాధ్యత.” అని ఏ.పి.ఎన్. ఫౌండేషన్ చైర్మన్ లయన్ శ్రీరామ్ దత్తి కన్నీటి పర్యంతమయ్యారు.

“స్వర్గీయ విజయ్ కుమార్ గారికి ముగ్గురు అబ్బాయిలు పెద్దబ్బాయి కుటుంబంతో సహా తండ్రి దగ్గరే ఉంటారు .ఇద్దరు కవల పిల్లలు ఫారన్ లో ఉంటారు . విదేశాల్లో ఉంటున్న కవల పిల్లలు, బంధువులు వచ్చాక శనివారం అంతిమ సంస్కారాలు జరుగుతాయి.అభిమానుల శ్రేయోభిలాషుల దర్శనార్థం వారి భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని వారి స్పృహంలో ఉంచుతారు.” అని ఏపిఎన్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రాపోలు దత్తాత్రి తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here