మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ #SDT18 ఇంపార్టెంట్ రోల్ లో అనన్య నాగళ్ల

0
97
#SDT18 - Ananya Nagalla - Sai Durgha Tej
#SDT18 - Ananya Nagalla - Sai Durgha Tej

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ #SDT18 ఇంపార్టెంట్ రోల్ లో అనన్య నాగళ్ల

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18 చేస్తున్నారు. డెబ్యుటెంట్ రోహిత్ కెపి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. హనుమాన్ సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

మేకర్స్ లేటెస్ట్ గా మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో మల్టీ ట్యాలెంటెడ్ అనన్య నాగళ్ల ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నారు. ఛార్మింగ్ స్మైలీ లుక్ తో  ప్రెజంట్ చేసిన అనన్య నాగళ్ల ఇంట్రో పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.  

ఇటివలే రిలీజ్ చేసిన “ఇంట్రూడ్ ఇన్‌టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ” వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఓ అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేయడంలో ప్రొడక్షన్ టీమ్ డెడికేషన్ ని ఈ వీడియో ప్రజెంట్ చేసింది.

#SDT18 లో సాయి దుర్గ తేజ్ మునుపెన్నడూ చేయని పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. మోస్ట్ ట్యాలెంటెడ్ ఐశ్వర్య లక్ష్మి ఈ హై-ఆక్టేన్, పీరియడ్-యాక్షన్ డ్రామాలో సాయి దుర్గ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సెన్సేషనల్ కంపోజర్ బి. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించనున్నారు.  

ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా విడుదల కానుంది.  మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

తారాగణం: సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి, జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రోహిత్ కె.పి
నిర్మాతలు: కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
మ్యూజిక్: బి. అజనీష్ లోక్‌నాథ్
పీఆర్వో: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here