“రెడీ” సినిమాలా “ధూం ధాం” కూడా బ్లాక్ బస్టర్ ఎంటర్ టైనర్ కావాలి – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ శ్రీనువైట్ల
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా హైదరాబాద్ లో “ధూం ధాం” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో
నటుడు గోపరాజు రమణ మాట్లాడుతూ – “ధూం ధాం” సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ రామ్ కుమార్ గారికి, డైరెక్టర్ సాయికిషోర్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాకు వర్క్ చేసినన్ని రోజులు హ్యాపీగా నిద్రపోయాను. నటుడిగా అంత సంతృప్తినిచ్చిన చిత్రమిది. “ధూం ధాం” సినిమా చేతన్ కు పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు నవీన్ మాట్లాడుతూ – నటుడిగా నాకు “ధూం ధాం” సినిమా పునర్జన్మ లాంటిది. కొన్నేళ్ల కిందట యాక్సిడెంట్ అయి సినిమాలకు దూరమయ్యాను. మళ్లీ “ధూం ధాం” సినిమాతో మంచి అవకాశం దక్కింది. ఈ సినిమా చేస్తున్నప్పుడే అనిల్ రావిపూడి గారు భగవంత్ కేసరిలో, శ్రీను వైట్ల గారు విశ్వం సినిమాలో అవకాశాలు ఇచ్చారు. ఈ సినిమా నాకు మరింత పేరు తెస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.
నటుడు ప్రవీణ్ మాట్లాడుతూ – “ధూం ధాం” సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. నటిస్తున్నప్పుడు మేము ఎంతగా ఎంజాయ్ చేశామో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. రామ్ కుమార్ లాంటి మంచి నిర్మాతకు సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు గిరిధర్ మాట్లాడుతూ – “ధూం ధాం” సినిమాలో ఒక గ్రూప్ గా నేను వెన్నెల కిషోర్, ప్రవీణ్ ఉంటాం. మేము చేసిన సీన్స్ అన్నీ హిలేరియస్ గా వచ్చాయి. సినిమాలో మీకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి తప్పకుండా ఈ నెల 8న మా మూవీ థియేటర్స్ కు వెళ్లి చూడండి. అన్నారు.
నటుడు బెనర్జీ మాట్లాడుతూ – “ధూం ధాం” సినిమాకు వర్క్ చేయడాన్ని మేమంతా ఎంజాయ్ చేశాం. తండ్రీ కొడుకుల మధ్య ఉండే మంచి అనుబంధాన్ని ఈ మూవీలో చూస్తారు. అలాగే రామ్ కుమార్ గారు ఈ సినిమాతో వాళ్ల అబ్బాయి చేతన్ కు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ – రామ్ కుమార్ గారు నాకు బాగా తెలుసు. వాళ్ల అబ్బాయిని హీరోగా మంచి స్థాయిలో చూడాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాతో ఆయన కోరిక తీరాలని కోరుకుంటున్నా. పండక్కి రిలీజైన మూడు సినిమాలు సక్సెస్ ఫుల్ గా వెళ్తున్నాయి. “ధూం ధాం” కూడా ఆ లిస్టులో చేరాలని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ – నిర్మాత రామ్ కుమార్ మంచి మిత్రుడు. ఆయన వాళ్ల అబ్బాయిని తీసుకొచ్చి ఒకసారి పరిచయం చేశారు. చేతన్ కు హీరో కావాలని ఉందని అన్నారు. మిగతా రంగాల్లో వారసులన ఎంకరేజ్ చేస్తాం గానీ సినిమా రంగంలో కొంత భయపడతాం. కానీ చేతన్ చాలా కాన్ఫిడెంట్ గా మూవీ చేశాడు. ఈ సినిమా చేతన్ కు, రామ్ కుమార్ కు మంచి విజయాన్ని ఇస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.
దర్శకుడు వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ – సాయికిషోర్ మచ్చ నాకు మంచి మిత్రుడు. శ్రీను వైట్ల గారి దగ్గర వర్క్ చేసినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాడు. దర్శకత్వ శాఖలో ఎక్సిపీరియన్స్ తెచ్చుకున్నాడు. గతంలో జేమ్స్ బాండ్ అనే మూవీ చేశాడు. అది ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. ఈ సినిమాతో సాయి కిషోర్ కు మంచి సక్సెస్ దక్కాలి. అలాగే గోపీ సుందర్ ఇప్పుడు మనకున్న గొప్ప సంగీత దర్శకుల్లో ఒకరు. ఆయన ఈ మూవీకి హిట్ సాంగ్స్ చేశాడు. నేను కొన్ని సాంగ్స్ విన్నాను. “ధూం ధాం” సినిమా చేతన్ కు సెకండ్ మూవీ. ఆయనకు ఈ సినిమా పెద్ద విజయాన్ని అందించాలి. ఈ మూవీకి మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
దర్శకుడు సాయిరాజేశ్ మాట్లాడుతూ – “ధూం ధాం” సినిమా స్టోరీ నాకు తెలుసు. పాటలు విన్నాను. చేతన్ గారు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేశారు. ఈ సినిమాకు సక్సెస్ ఇస్తుందని కోరుకుంటున్నా. అలాగే మంచి టీమ్ అంతా కలిసి వర్క్ చేసిన చిత్రమిది. గోపీ మోహన్ గారు నా మిత్రులు. ఆయన నాకు కొన్నేళ్లుగా బ్యాక్ బోన్ లా ఉన్నారు. మ్యూజిక్, స్క్రిప్ట్ విషయాల్లో నాకు సపోర్ట్ ఇస్తుంటారు. కొబ్బరిమట్ట సినిమా ఫైనాన్షియల్ గా ఆగిపోయినప్పుడు సపోర్ట్ చేశారు. ఈ వేదిక నుంచి గోపీ మోహన్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. హెబ్బా పటేల్ 2.ఓ అనిపించేలా “ధూం ధాం” సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
శ్రీరామ శాస్త్రి మాట్లాడుతూ – మా రామజోగయ్య శాస్త్రి రెండు దశాబ్దాలుగా సినీ సాహితీ ప్రస్థానం చేస్తున్నారు. ఆయనకు సహజంగా వచ్చిన సరస్వతీ కటాక్షం వల్లే ఇంత గొప్ప పాటలు రాయగలిగారు. ఈరోజు ఆయనకు ఈ వేదిక మీద సన్మానం చేయడం, అది నా చేతుల మీదుగా జరగడం సంతోషంగా ఉంది. మరెన్నో మంచి పాటలు ఆయన ప్రేక్షకులకు అందిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ – రెండు దశాబ్దాలు తెలుగు చిత్ర పరిశ్రమలో గీత రచయితగా ప్రయాణం చేయడం సంతోషాన్ని, సంతృప్తినీ ఇస్తోంది. “ధూం ధాం” సినిమాకు మంచి పాటలు రాసే అవకాశం వచ్చింది. ఈ సినిమా చూసి మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వంటి పెద్ద సంస్థ రిలీజ్ చేస్తుందంటే అక్కడే మా మూవీ విజయం సాధించినట్లు. చేతన్ ఎంతో అదృష్టవంతుడు. ఆయనకు రామ్ కుమార్ గారి లాంటి తండ్రి ఉన్నారు. సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఉండి, కొడుకు కోసం ఇక్కడికి వచ్చి మూవీ చేశారు. ఈ దీపావళికి రిలీజైన చిత్రాల ఒరవడిలో “ధూం ధాం” కూడా విజయాన్ని సాధించాలి. అన్నారు.
నిర్మాత రామ్ కుమార్ మాట్లాడుతూ – మా “ధూం ధాం” సినిమా ఈవెంట్ కు పిలవగానే గెస్టులుగా వచ్చిన వైవీఎస్ చౌదరి గారికి, శ్రీనువైట్ల గారికి, సాయి రాజేశ్ గారికి ఇతర గెస్టులకు అందరికీ థ్యాంక్స్ . ఈ సినిమాకు మా టీమ్ అంతా మనసు పెట్టి పనిచేశారు. రామజోగయ్య శాస్త్రి గారు మంచి లిరిక్స్ ఇచ్చారు. గోపీ సుందర్ గారు ఛాట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారు. ఓ పాటలో ఆయన మా రిక్వెస్ట్ మీద కనిపించారు. బ్యూటిఫుల్ విజువల్స్, సాంగ్స్ ఉన్న చిత్రమిది. మా అబ్బాయి చేతన్ ను హీరోగా మరో మెట్టు ఎక్కిస్తుంది. హెబ్బా పటేల్ బాగా నటించింది, ఎనర్జిటిక్ గా డ్యాన్సులు చేసింది. ఆమెకు కూడా సినిమా పేరు తెస్తుంది. గోపీ మోహన్, సాయి కిషోర్ ఎంతో ప్యాషనేట్ గా ఈ సినిమా తెరకెక్కించారు. వారికి థ్యాంక్స్. “ధూం ధాం” సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మీరంతా సకుటుంబంగా వచ్చి ఈ నెల 8వ తేదీన మూవీ చూడండి. అన్నారు.
నటుడు సాయికుమార్ మాట్లాడుతూ – “ధూం ధాం” సినిమాలో ఫాదర్ రోల్ చేశాను. నేను మా అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎలా టెన్షన్ పడ్డానో ఇప్పుడు రామ్ కుమార్ గారిలో ఆ ఉద్వేగం కనిపిస్తోంది. ఈ సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. చేతన్, హెబ్బా ఇద్దరూ బాగా నటించారు. నేను ఈ మధ్య చేసిన కమిటీ కుర్రోళ్లు, సరిపోదా శనివారం వంటి సినిమాలు పెద్ద హిట్స్ అయ్యాయి. ఈ సినిమా కూడా అలాగే సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ సాయికిషోర్ మచ్చా మాట్లాడుతూ – “ధూం ధాం” సినిమాలో ఫస్ట్ సాంగ్స్ బాగున్నాయనే టాక్ వచ్చింది. అందుకు గోపీ సుందర్ గారికి, రామజోగయ్య గారికి థ్యాంక్స్ చెబుతున్నా. సినిమా షూటింగ్ లో నా టీమ్ ఎంతో సపోర్ట్ చేశారు. మంచి ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. బాగా నవ్వుకుంటారు. మీ టికెట్ ధరకు సరిపడా నవ్వులు అందిస్తాం. శ్రీను వైట్ల గారి కామెడీని, వైవీఎస్ గారి సాంగ్స్ స్టైల్ ను ఇన్సిపిరేషన్ గా తీసుకుని ఈ మూవీ చేశాను. సినిమా మేకింగ్ మొత్తం రామ్ కుమార్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా కోసం ఏది అడిగినా, ఎంత బడ్జెట్ అయినా ఇచ్చారు. వారి ఇంట్లో అయినా, పోలెండ్ లో అయినా ఒకేలా చూసుకున్నారు. ఈ సినిమా చేతన్ కు మంచి పేరు తేవాలి, హెబ్బా చాలా ఎనర్జిటిక్ గా చేసింది. ఆమెకు కూడా సక్సెస్ ఇవ్వాలి. ఈ నెల 8వ తేదీన తప్పకుండా థియేటర్స్ కు వెళ్లి “ధూం ధాం” చూడండి. అన్నారు.
హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ – మా “ధూం ధాం” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ లుగా వచ్చిన శ్రీను వైట్ల గారికి, వైవీఎస్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా నాకు ది బెస్ట్ వర్కింగ్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. చేతన్ లాంటి గుడ్ కోస్టార్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ప్రొడ్యూసర్ రామ్ కుమార్ గారికి, డైరెక్టర్ సాయి గారికి థ్యాంక్స్. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ధూం ధాం” థియేటర్స్ లో చూడమని ప్రేక్షకుల్ని కోరుతున్నా. అన్నారు.
హీరో చేతన్ కృష్ణ మాట్లాడుతూ – నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్. సినిమాల్లోకి రావాలని ఎప్పటినుంచో కోరిక. ఫస్ట్ ర్యాంక్ రాజు, గల్ఫ్ అనే మూవీస్ చేశాను. కొద్దిగా గుర్తింపు వచ్చింది. అయితే మేము ఆశించిన సక్సెస్ దక్కలేదు. అప్పుడు మా వెల్ విషర్స్ సజెస్ట్ చేశారు ఒక మంచి ప్రయత్నం చేయండి. మీ బెస్ట్ ప్రొడక్షన్ తో సినిమా చేయండి అన్నారు. అలా రూపుదిద్దుకున్నదే “ధూం ధాం” సినిమా. మన తెలుగు మూవీస్ కు కాకుండా చిన్న డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఇస్తున్నారు. ఇది బాధ కలిగిస్తోంది. తెలుగు నేటివ్ మూవీస్ ను ఎంకరేజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. హిలేరియస్ ఎంటర్ టైనర్ మూవీ ఇది. ఒక్క ఛాన్స్ మా సినిమాకు ఆడియెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా. సినిమా బాగా లేకుంటే అందరికీ చెప్పండి, బాగుంటే పది మందికి చెప్పిండి. మౌత్ టాక్ కంటే గొప్ప ప్రచారం లేదు. మీకు నవ్వులు గ్యారెంటీ. అన్నారు.
డైరెక్టర్ శ్రీను వైట్ల మాట్లాడుతూ – టాలీవుడ్ లో 20 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్న మా రామజోగయ్య శాస్త్రి గారికి శుభాకాంక్షలు. “ధూం ధాం” సినిమా సాంగ్స్ చాలా బాగున్నాయి. ఫస్టాప్ ప్లెజంట్ గా ఉండి, సెకండాఫ్ హిలేరియస్ గా ఉందని ఈ సినిమాకు వర్క్ చేసిన నా ఫ్రెండ్స్ చెప్పారు. మా రెడీ సినిమా అప్పుడు కూడా సెకండాఫ్ హిలేరియస్ గా ఉందనే టాక్ బిఫోర్ రిలీజ్ కే వచ్చింది. రెడీ సినిమాలా “ధూం ధాం” కూడా బ్లాక్ బస్టర్ ఎంటర్ టైనర్ కావాలి. అందరినీ మంచితనంతో ఎలా టీమ్ వర్క్ చేయించుకోవాలో రామ్ కుమార్ గారికి తెలుసు. ఆయన వాళ్ల అబ్బాయి కోసం సినిమాకు సంబంధించిన నాలెడ్జ్ మొత్తం తెలుసుకున్నారు. అలాంటి ఫాదర్ ఉన్నందుకు చేతన్ అదృష్టవంతుడు. చేతన్ కూడా తండ్రి గర్వపడే స్థాయికి వెళ్లాలి. “ధూం ధాం” సినిమాకు మా గోపీ మంచి స్క్రిప్ట్ చేశాడు. సాయి కిషోర్ ప్యాషనేట్ గా రూపొందించాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అందుకోవాలి. అన్నారు.
నటీనటులు – చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు
టెక్నికల్ టీమ్
డైలాగ్స్ – ప్రవీణ్ వర్మ
కొరియోగ్రఫీ – విజయ్ బిన్ని, భాను
లిరిక్స్ – సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
ఫైట్స్ – రియల్ సతీష్
పబ్లిసిటీ డిజైనర్స్ – అనిల్, భాను
ఆర్ట్ డైరెక్టర్ – రఘు కులకర్ణి
ఎడిటింగ్ – అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ్ రామస్వామి
మ్యూజిక్ – గోపీ సుందర్
స్టోరీ స్క్రీన్ ప్లే – గోపీ మోహన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివ కుమార్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్ – ఎంఎస్ రామ్ కుమార్
డైరెక్టర్ – సాయి కిషోర్ మచ్చా